వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీటికి సమాధానం చెప్పు: జగన్ 100 ప్రశ్నలకు టిడిపి కౌంటర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోచుకొని, ఇప్పుడు నేరుగా దోచుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తున్నారని, వైసిపి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి నేత, గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు.

బాబుకు 100 ప్రశ్నలు: బొత్స, 'జగన్‌కు మరో 15మంది ఎమ్మెల్యేలు షాక్'బాబుకు 100 ప్రశ్నలు: బొత్స, 'జగన్‌కు మరో 15మంది ఎమ్మెల్యేలు షాక్'

అధికారంలో ఉన్నప్పుడు జగన్ దోచుకున్నారని, దానిని దాచుకొని, ఇప్పుడు మరింత దోచుకునేందుకు గడపగడపకు వైసిపి పేరిట ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ప్రజలకు దూరంగా ఉన్న వైసిపి ప్రజల్లోకి వచ్చే ముందు తమ నేరాలకు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ దాడి, దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్: బాబు వ్యూహరచన బీజేపీ దాడి, దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్: బాబు వ్యూహరచన

ప్రజల్లో ఉనికి, నాయకుల్లో విస్వాసం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ అభివృద్ధికి అడ్డుపడటం ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టిడిపిపై వస్తున్న వంద ప్రశ్నలకు సమాధానం అడిగే ముందు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

TDP counter questions to YS Jagan on his DA case

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.లక్ష కోట్లు జగన్ సంపాదించింది నిజమా, కాదా అని నిలదీశారు. పదహారు నెలల పాటు జైలులో, సీబీఐ ఛార్జీషీట్లలో ఏ -1 ముద్దాయిగా ఉన్నారా, లేరా చెప్పాలన్నారు. ఈ కేసుల నిమిత్తం విచారణకు కోర్టు గడప ముందు చేతులు కట్టుకొని నిలబడటం లేదా అని ప్రశ్నించారు.

బెయిల్ కోసం ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కు అయ్యారా, కాలేదా చెప్పాలన్నారు. కాగా, ఈ రోజు నుంచి వైసిపి 'గడపగడపకు వైసిపి' ప్రారంభం కానుంది. వైసిపి టిడిపి ప్రభుత్వానికి వంద ప్రశ్నలను సంధిస్తోంది.

English summary
TDP counter questions to YSRCP chief YS Jagan on his DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X