'విధ్వంసానికి జగన్ స్కెచ్, శంషాబాద్‌లో అరెస్ట్ చేయండి': వస్తున్నాడు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే అడ్డుకోవాలని టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు గురువారం అన్నారు.
విశాఖ: సిఐఐ సదస్సును అడ్డుకోవాలని వైసిపి కుట్ర చేస్తోందని, విశాఖలో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే అడ్డుకోవాలని టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు గురువారం అన్నారు. జగన్‌ను అక్కడే అరెస్ట్ చేయాలన్నారు.
పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!
బోండా ఉమ ఆగ్రహం
విశాఖలో విధ్వంసానికి, హింసాత్మక ఘటనలకు జగన్ స్కెచ్ వేశారని బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని జగన్ కోరుకుంటున్నారన్నారు.

ప్రత్యేక హోదాకు సమానమైన లబ్ధి చేకూరుస్తామని కేంద్రం చెప్పిందని, అలా చేసే వరకు తమ ప్రభుత్వం రాజీపడదన్నారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. విశాఖను మరో తుని చేయలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని వైసిపి చూస్తోందన్నారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన జగన్
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరారు. ఆయన సాయంత్రం ఆర్కే బీచ్‌లో జరగనున్న క్యాండిల్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇందుకోసం శంషాబాద్ నుంచి బయలుదేరారు.












Click it and Unblock the Notifications