అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని శ్మశానం అంటూ..: బొత్సా వివాదస్పద వ్యాఖ్యలు: భర్తరఫ్ కు డిమాండ్ ....!

|
Google Oneindia TeluguNews

మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న అమరావతిలో పర్యటించాలని నిర్ణయించారు. దీనికి స్పందనగా మంత్రి బొత్సా మాట్లాడుతూ..అమరావతిని శ్మశానంతో పోల్చుతూ మాట్లాడారు. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా..అంటూ ప్రశ్నించారు.

దీనికి కొనసాగింపుగా ఐదేళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి చెప్పారు. ఇప్పుడు బొత్సా చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ రాజధానిని శ్మశానంతో పోల్చటం ఏంటని నిలదీస్తున్నారు. అసెంబ్లీ..హైకోర్టు..సచివాలయం ఉన్న రాజధాని శ్మశానంతో పోల్చిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని శ్మశానం అంటూ..

రాజధాని శ్మశానం అంటూ..

ప్రతిపక్షనేత చంద్రబాబు ఈనెల 28వ తేదీన అమరావతి పర్యటనకు రావడంపై రాష్ట్ర మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా..అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఐదేళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి ఆ తరువాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. గత నాలుగేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు ఏం ఊడబొడిచారని ప్రశ్నించారు. ల్యాండ్‌పూలింగ్‌ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం 35,000 ఎకరాలు తీసుకొంది. మరి వాటిని ఎందుకని ఆయన హయాంలో అభివృద్ధి చేయలేదంటూ నిలదీసారు. చంద్రబాబు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి బొత్సా డిమాండ్ చేసారు.

బొత్సాను భర్తరఫ్ చేయాలి..

బొత్సాను భర్తరఫ్ చేయాలి..

మంత్రి బొత్సా ఏపీ రాజధానిని శ్మశానంతో పోల్చటం పైన టీడీపీ సీనియర్ నేత యనమల తీవ్రంగా స్పందించారు. ఏపీలో శాసససభ..హైకోర్టు..సచివాలయం లాంటి అత్యున్నత వ్యవస్థలు ఉన్న రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోలుస్తారా అంటూ ప్రశ్నించారు. 29 గ్రామాల ప్రజలు..34 వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన రైతులను అవమాన పరిచేలా బొత్సా వ్యాఖ్యలు ఉన్నాయని మండి పడ్డారు. ప్రధాని మోదీ..జాతీయ ..అంతర్జాతీయ ప్రముఖల సమక్షంలో అమరావతికి శంకుస్థాపన చేసారని..అటువంటి ప్రాంతాన్ని శ్మశానంతో ఎలా పోలుస్తారని నిలదీసారు. బాధ్యతా రాహిత్యంగా ఇటువంటి ప్రకటన ద్వారా రాజధాని పైన వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న మంత్రి బొత్సాను వెంటనే కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని యనమల డిమాండ్ చేసారు.

Recommended Video

అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమన్న బొత్స || Botsa Sathyanarayana Comments On Pawan Kalyan
సీఎం శ్మశానం నుండే పాలిస్తున్నారా..

సీఎం శ్మశానం నుండే పాలిస్తున్నారా..

మంత్రి బొత్సా అమరావతిని శ్మశానంతో పోలుస్తున్నారని..మరి ఇదే శ్మశానం నుండి సీఎం జగన్..మంత్రులు పాలన చేస్తున్నారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. బొత్సాను ముఖ్యమంత్రి భర్తరఫ్ చేయకపోతే ఆయన వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని యనమల వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి బొత్సా మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకొనే ప్రయత్నం చేసారు. రైతుల నుండి తీసుకున్న 35 వేల ఎకరాల భూములను చంద్రబాబు హాయంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి బొత్సా వ్యాఖ్యలతో మరో సారి రాజకీయంగా విమర్శలు..ప్రతివిమర్శలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

English summary
Minister Botsa Satyanarayana sensational comments on Amaravati. He compared capital as burial ground. TDP seriously reacted on these comments and demanded for expel Botsa from cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X