రీ పోలింగ్‌కు మరో అభ్యర్ధన: ఏడు నియోజకవర్గాల్లో 19 కేంద్రాల్లో : టీడీపీ తాజా డిమాండ్...!
ఏపీలో చంద్రగిరి రచ్చ కొత్త డిమాండ్‌కు కారణమైంది. చంద్రగిరిలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు సీఎస్ చేసిన సిఫార్సు కారణమని భావిస్తున్న టీడీపీ..తమ డిమాండ్లను తెర మీదకు తెచ్చింది. గతంలోనే ఎన్నికల సంఘాన్ని కలిసి నివేదించిన అంశాన్ని మరో సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందు ఉంచింది. ఏపీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాని డిమాండ్ చేసింది.
ఢిల్లీకి చంద్రబాబు..సీఎస్ వద్దకు నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రగిరిలో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు సంబంధించి నిరసన వ్యక్తం చేయనున్నారు. తామిచ్చిన ఫిర్యాదుల పైన స్పందించని ఎన్నికల సంఘం ఇప్పుడు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలింగ్ ముగిసిన నెల రోజుల తరువాత రీ పోలింగ్ నిర్వహించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో అందుబాటులో ఉన్న టీడీపీ నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసారు. ఎన్నికల రీ పోలింగ్‌కు సీఎస్ లేఖ కీలకంగా భావిస్తున్న టీడీపీ నేతలు దీని పైన ఆయన్ను ప్రశ్నించారు. అయితే, సీఎస్ దళితులు ఓటు హక్కు వేయలేకపోయారని ఫిర్యాదు రావటంతో దానిని సీఈవోకు పంపామని వివరించారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేసేలే చూడాల్సిన బాధ్యత తమ పైన ఉందని సమాధానం ఇచ్చారు. దీంతో..టీడీపీ నేతలు అసంతృప్తిగానే వెనక్కు తిరిగారు.

19 కేంద్రాల్లో రీ పోలింగ్ కావాలి..
వైసీపీ కోరిన వెంటనే రీ పోలంగ్‌కు ఆదేశించారు..అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్న విధంగా ఏడు నియోజకవర్గా ల్లోని 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ నేతలు లేఖ ఇచ్చారు. అందులో సీఎస్ లేఖ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలోని నర్సరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 పోలింగ్ కేంద్రాల్లో
రీ పోలింగ్ నిర్వహించాలని గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని..ఇప్పుడైనా సీఎస్ చొరవ తీసుకొని వీటిల్లో రీ పోలింగ్‌కు సిఫార్సు చేయాలని కోరారు. ఇక, టీడీపీ నేతలు మరో సారి సీఎస్ మీద ఆరోపణలు చేసారు. సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీ అనుకున్నామని...అయితే చెవిరెడ్డి సెక్రటరీ అని తెలిసిందని టీడీపీ మహిళా నేత అనూరాధా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళటంతో అక్కడ ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి...
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications