రివర్స్: మోడీకి మద్దతుకు కారణమేమిటీ? ప్రధానితో భేటీపై మాట్లాడొద్దన్న బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ప్రధానమంత్రి నరేంద్రమోడీని వైసీపీ అధినేత జగన్ ను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంలో అంతరార్ధమేమిటని టిడిపి ప్రశ్నిస్తోందిప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని వైసీపీ చీఫ్ ఎందుకు ప్రధానికి చెప్పలేదని ఆ పార్టీ ప్రశ్నించింది.

ఇది చదవండి: జగన్ దోషి కాదు: పురంధేశ్వరి సంచలనం, బాబుకు ఝలక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం కావడం పట్ల టిడిపి తన దూకుడును పెంచింది.

అమెరికా పర్యటన నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ దూకుడును మరింత పెంచింది ఆ పార్టీ. అయితే అదే సమయంలో టిడిపిపై వైసీపీ కూడ విమర్శలను ఎక్కుపెడుతోంది.

తప్పుడు ప్రచారాల ద్వారా టిడిపి రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. తనను ఏ రకంగా అణచివేసేందుకు టిడిపి ప్రయత్నిస్తోందో జగన్ వివరించారు.అయితే రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిణామాలన్నింటిని ప్రధానమంత్రి మోడీకి వివరించానని ఆయన చెప్పారు.

ప్రధానిని కలవడంపై మంత్రులు మాట్లాడొద్దన్న బాబు

ప్రధానిని కలవడంపై మంత్రులు మాట్లాడొద్దన్న బాబు

ప్రధానమంత్రి నరేంద్రమోడీని వైసీపీ చీఫ్ జగన్ కలవడంపై మాట్లాడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు.ప్రధానమంత్రి హోదాలో ఉన్నందున ఆయనను చాలామంది కలుస్తుంటారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనను అనేకమంది కలిసే విషయాన్ని ప్రస్తావించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి మద్దతు విషయాన్ని భేషరతుగా వైసీపీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిన అంశాన్ని ప్రస్తావించాలని బాబు మంత్రులకు సూచించారు. మంత్రివర్గసమావేశంలో ఈ విషయమై చర్చ సందర్భంగా బాబు మంత్రులకు సూచించారు.

ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి ఏమిటీ?

ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై వైసీపీ స్వతహాగా, ఇతర పార్టీలతో కలిసి ఆందోళన చేసింది. ఈ డిమాండ్ ను కొనసాగిస్తోంది.అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 10వ, తేదిన ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ప్రకటించారు.అయితే ఈ అంశాన్ని రాజకీయంగా టిడిపి తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి మారిందా ని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రత్యేకహోదా గురించి ఆ పార్టీ ఎందుకు ప్రధానమంత్రి వద్ద ప్రస్తావన చేయలేదని టిడిపి ప్రశ్నిస్తోంది.

భేషరతుగా ఎన్ డి ఏ అభ్యర్థికి ఎందుకు మద్దతిచ్చారు

భేషరతుగా ఎన్ డి ఏ అభ్యర్థికి ఎందుకు మద్దతిచ్చారు

భేషరతుగా ఎన్ డి ఏ అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారనే విషయమై వైసీపీ స్పష్టత ఇవ్వాలని టిడిపి కోరుతోంది. ప్రధానమంత్రి అడగకుండానే రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చిందా, లేక ప్రధానమంత్రి అడిగారా అని ప్రశ్నిస్తోంది.అయితే మరో వైపు ప్రత్యేకహోదా విషక్ష్మై సుమారుగా 15 నిమిషాలపాటు మాట్లాడిన విషయాన్ని జగన్ మీడియా సమావేశంలో వివరించారు. అయితే ఈ సమయంలోనే ప్రత్యేకహోదాకు లింక్ పెట్టి మద్దతు విషయాన్ని ఎందుకు తేల్చలేదని టిడిపి నాయకత్వం ప్రశ్నిస్తోంది.అంటే బయటకు చెప్పే కారణాలు వేరే, అంతర్గతంగా ఉన్న కారణాలు వేరేవి ఉన్నాయని టిడిపి నాయకులు వైసీపీ చీఫ్ పై ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు.

ఎంపిలతో రాజీనామాలు ఎప్పుడు చేయిస్తారు?

ఎంపిలతో రాజీనామాలు ఎప్పుడు చేయిస్తారు?

ప్రత్యేకహోదా కోసం ఎంపిలతో రాజీనామాలు చేయిస్తానని వైసీపీ అధినేత జగన్ గతంలో ప్రకటించారు. అయితే ఎంపిల రాజీనామాల ద్వారా ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.అయితే ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రత్యేక హోదా అంశం గురించి వైసీపీ ఎందుకు గట్టిగా మాట్లాడలేదని అధికార టిడిపి వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎంపిలతో జగన్ ఎప్పుడు రాజీనామాలు చేయిస్తారో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp demanded to Ysrcp chief Ys Jagan what is the reason for supporting NDA candidate in President elections.Ysrcp and Tdp allegations each and other.
Please Wait while comments are loading...