కీలక టైంలో చేయి: శిల్పా చక్రపాణిని ఉపేక్షించొద్దు, రాజీనామాపై టిడిపి నేతల పట్టు!

టిడిపి నుంచి వైసిపిలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదంపై తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

నంద్యాల: టిడిపి నుంచి వైసిపిలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదంపై తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

మండలికి చైర్మన్ లేరు

మండలికి చైర్మన్ లేరు

ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా మండలికి పంపించారు. ఆ తర్వాత తన తరఫున శాసన సభ కార్యదర్శికి పంపించారు. దీనిపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మండలికి చైర్మన్ లేరు.

త్వరలో డిప్యూటీ చైర్మన్

త్వరలో డిప్యూటీ చైర్మన్

డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. కొద్ది రోజుల్లో విజయవాడ రానున్నారు. అప్పుడు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

వివరణ తీసుకొని..

వివరణ తీసుకొని..

రాజీనామా చేసిందీ లేనిదీ శిల్పా చక్రపాణి రెడ్డిని పిలిపించి మాట్లాడటం లేదా ఫోన్లో మాట్లాడి నిర్ధారించుకోవడం చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాక చేపడతారా, ఈ లోపే జరుపుతారా తెలియాల్సి ఉంది.

చక్రపాణి రెడ్డిని ఉపేక్షించవద్దని

చక్రపాణి రెడ్డిని ఉపేక్షించవద్దని

ఉప ఎన్నికల వంటి కీలక సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరారు. తన సోదరుడికి అండగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో శిల్పా చక్రపాణి రెడ్డిపై ఉపేక్షించవద్దని, ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించడం మంచిదని ఎక్కువ మంది టిడిపి నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+