టీడీపీకి మరో ఎదురు దెబ్బ..?
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై సోమవారం ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని, దాని విలువ 4400 కోట్లని ఏపీ సీఐడి అభియోగాలు మోపింది. ఈ ఘటన మరువక ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేరు సైతం తెర మీదకు వచ్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారాయణ మంత్రిగా పని చేశారు. పార్టీలో సీనియర్లను కాదని నారాయణకు చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించడం అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది. తాజాగా మాజీ మంత్రి నారాయణకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఏపీ రాజధాని ఏర్పాటు ముసుగులో మాజీమంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్‌కు పాల్పడ్డారనేది ఈ వార్త సారాంశం.

రాజధాని ప్రాంతంలో అక్రమాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్‌లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. తాజాగా మాజీమంత్రి నారాయణకు అత్యంత ఆప్తుడు నారాయణ విద్యాసంస్థల గ్రూప్ జనరల్ మేనేజర్‌గా వ్యహారిస్తున్న విజయ భాస్కర్ రెడ్డి ద్వారా అధికారులు కొన్ని కీలక విషయాలను సేకరించినట్టు సమాచారం.
నారాయణ అక్రమ ఆస్తులతో పాటు విద్యాసంస్థల్లో అన్యాయాలు , ఆయన భూముల వివరాలను విజయభాస్కర్ రెడ్డి బయట పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు అతి త్వరలోనే దర్యాప్తు చేపడతారని తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని భూముల స్కాంలో నారాయణ ఏ2 గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరోసారి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎవరు స్పందించలేదు.












Click it and Unblock the Notifications