మహిళా దినోత్సవం పేరిట, సన్మానం చేసే హక్కు మీకెక్కడిది జగన్ రెడ్డి? విరుచుకుపడిన టీడీపీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళా దినోత్సవంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను సత్కరించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా దినోత్సవం పేరిట సన్మానం చేసే హక్కు మీకెక్కడిది జగన్ రెడ్డి అంటూ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసింది.
మహిళలకు జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఘనకార్యాలు ఇవి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన దారుణాలను ఏకరువు పెట్టింది టీడీపీ.
మహిళలపైన జరిగిన నేరాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉంది: టీడీపీ
సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేసి జగన్ రెడ్డి రాజ్యంలో 2020లో గ్యాంగ్ రేప్ చేసి ఐదుగురు మహిళలను చంపేశారని, మహిళలపైన జరిగిన నేరాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్ర ప్రదేశ్ మార్చారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువవుతోంది అని విమర్శించారు. చంద్రబాబు పాలనతో పోల్చుకుంటే 11 శాతం అత్యాచారాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పెరిగాయని పేర్కొన్నారు.

జగన్ రెడ్డి రాజ్యం లో ఏపీలో ప్రతి 8 గంటలకు ఒక రేప్ జరుగుతుంది
జగన్ రెడ్డి రాజ్యం లో ఏపీలో ప్రతి 8 గంటలకు ఒక రేప్ జరుగుతుందంటూ వెల్లడించారు. 2020 నేరాల లెక్కల ప్రకారం మానవ అక్రమ రవాణాలో దేశంలోనే ఏపి రెండవ స్థానంలో ఉందని మూడు రోజులకు ఒక మానవ అక్రమ రవాణా రాష్ట్రంలో జరుగుతుందని పేర్కొన్నారు. స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలలో ఏపి రెండవ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోమహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని వెల్లడించారు. 18 ఏళ్ల లోపు ఆడపిల్లలపై ప్రతి 12 గంటలకు ఒక అత్యాచారం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన తో పోల్చుకుంటే ఇట్లాంటి ఘటనలు 538 శాతం పెరగడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వెల్లడించారు.
ఏపీలో ఆటవస్తువులుగా దళిత మహిళలు
ఏపీలో దళిత మహిళలను ఆటవస్తువులు గా మార్చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. దళిత మహిళల మీద దాడులు, లైంగిక వేధింపులలో దక్షిణ భారతదేశంలో ఏపీ టాప్ లో ఉండగా, దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉందని, దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనలో 33.14 శాతం మన రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 23.7 78% మహిళల ఆత్మ గౌరవానికి గంగం కలిగించే ఘటనలలో పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు.

జగన్ రెడ్డి రాజ్యంలో రోజుకు 19 మంది మహిళలపై గృహ హింస
జగన్ రెడ్డి రాజ్యం లో రోజుకు 19 మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారని వెల్లడించారు. ఏపీలో ప్రతి గంటకు ఇద్దరు మహిళలపై దాడులు జరుగుతున్నాయని, 2020లో 17 వేల 89 మంది మహిళలపై దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. రోజుకు 47 ఘటనలు ప్రతి రెండు గంటలకు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగికంగా వేధింపులకు గురిచేసే విషయంలో ఏపీ రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
Recommended Video
మహిళలు ఎక్కువగా హింసకు గురైంది జగన్ రెడ్డి పాలనలోనే
చంద్రబాబు పాలన తో పోల్చుకుంటే ఏడు వందల శాతం భారీగా ఇటువంటి ఘటనలు పెరిగాయని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలపై లైంగిక దాడులు, హత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయని, మహిళలు ఎక్కువగా హింసకు గురైంది జగన్ రెడ్డి పాలనలోనే అని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్న సమయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనడాన్ని టిడిపి ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కి ఆ అర్హత లేదని తేల్చి చెబుతోంది.












Click it and Unblock the Notifications