వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచుకోట మతలబు ఏమిటి చంద్రబాబుగారూ?

తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో అభ్యర్థిని ఎంపిక చేయకుండా తాత్సారం చేయడంవల్ల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన కోట. వల్లభనేని వంశీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో విజయం సాధించిన తర్వాత అధికార వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీ పోటీచేయడం ఖాయమైంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.

ఆరుగురు పోటీపడుతున్నారు..

ఆరుగురు పోటీపడుతున్నారు..


గన్నవరం సీటు కోసం ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కు టికెట్ ఇవ్వాలని టీడీపీ తొలుత భావించినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. పార్టీ తరపున ప్రస్తుతం ఇన్ ఛార్జిగా బచ్చుల అర్జునుడు ఉన్నారు. సౌమ్యంగా ఉండే వ్యక్తి. అయితే ఆర్థికంగా బలవంతుడు కాకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. బచ్చుల అర్జునుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయనకు సీటిస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని హెచ్చరించారు.

వసంత అయితే ఎలా ఉంటుంది?

వసంత అయితే ఎలా ఉంటుంది?


గద్దే రామ్మోహన్, గద్దే అనురాధ పేర్లు కూడా వినిపించాయి. విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దే రామ్మోహన్ ను గన్నవరం పంపిస్తారని వార్తలు వచ్చాయి.పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కు టికెట్ ఇవ్వాలని టీడీపీ తొలుత భావించినా సతీష్ పెద్దగా ఆసక్తి చూపలేదు. మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరితో ఆయన గన్నవరం టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంగబలం, అర్థబలం రెండూ ఉన్న వసంత అయితే వంశీని ఢీకొట్టడానికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. వీరితోపాటు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కె.పట్టాభి పేరు కూడా వినపడుతోంది. అయితే పట్టాభి ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడా? లేడా? అనే మీమాంసలో అధిష్టానం ఉంది. త్వరలోనే దాసరి సోదరులు పార్టీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి.

 దుట్టా, యార్లగడ్డ సహకరిస్తారా?

దుట్టా, యార్లగడ్డ సహకరిస్తారా?


ఇంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. వంశీ బలమైన అభ్యర్థి కావడంతోపాటు అట్టడుగు వర్గాల్లోకి కూడా చొచ్చుకువెళ్లారు. గతానికి భిన్నంగా అభ్యర్థులను ముందే ఖరారు చేసుకుంటూ వెళుతున్న చంద్రబాబు గన్నవరం విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. వంశీకి మద్దతు ప్రకటించిన తర్వాత వైసీపీలో వర్గవిభేదాలు పెరిగాయి. ఎప్పటినుంచో పార్టీకి అండగా ఉంటున్నవారిని కాదని వంశీ తన సొంత వర్గానికే మేలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వంశీకి సహకరిస్తారా? అనే మీమాంస వైసీపీ వర్గాల్లో నెలకొంది.

English summary
The ranks of the party are expressing concern that Telugu Desam Party's chances of winning will be damaged by not selecting a candidate in a constituency like Kanchukota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X