కుట్ర రాజకీయాలపై చర్చ, మహనాడు వేదికగా భవిష్యత్ కార్యాచరణ: కళా వెంకట్రావు
విజయవాడ: ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు మహనాడును విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర మంత్రి , టిడిపి ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. భవిష్యత్తులో టిడిపి చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ మహనాడులో చర్చించనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు మహనాడు వేదికగా చంద్రబాబునాయుడు పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ ఏడాది మహనాడును విజయవాడలోనే నిర్వహించాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. మహనాడును ఎక్కడ నిర్వహించాలనే విషయమై పార్టీ నేతలు స్ధలం కోసం అన్వేషిస్తున్నారు.

విజయవాడ కానూరులోని సిద్దార్ధ కాలేజీని మహనాడు నిర్వహణ కోసం ఎలా ఉంటుందనే విషయాన్ని పార్టీ నేతలు పరిశీలించారు. మంగళవారం నాడు టిడిపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలు సిద్దార్ద కాలేజీ స్థలాన్ని పరిశీలించారు.
రాష్ట్రాభివృద్ది, సంక్షేమం కోసం మహనాడులో చర్చించనున్నట్టు టిడిపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రకటించారు. మే 27 నుండి మూడు రోజుల పాటు మహనాడును విజయవాడలో నిర్వహించనున్నట్టు కళా వెంకట్రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గత ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తును పెట్టుకొన్నామని కళా వెంకట్రావు గుర్తు చేశారు. కానీ, బిజెపి గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను విస్మరించిందన్నారు. అందుకే బిజెపితో పొత్తును తెగతెంపులు చేసుకొన్నట్టు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో పార్టీ ఏ రకంగా వ్యవహరించాలనే విషయమై చర్చించనున్నట్టు కళా వెంకట్రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు తమతో కలిసివచ్చేందుకు సిద్దంగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకొంటామని కళా వెంకట్రావు చెప్పారు.మంగళవారం నాడు టిడిపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలు సిద్దార్ద కాలేజీ స్థలాన్ని పరిశీలించారు.మరో వైపు ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమయంలో పార్టీని ఎన్నికలకు సన్నద్దం చేసే దిశగా మహనాడు వేదికను ఉపయోగించుకోనున్నారు. పార్టీ యంత్రాంగానికి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications