రోహిత్ ఫ్యామిలీకి టిడిపి రూ.5 లక్షలు, ఉద్యోగం!: బిజెపి హరిబాబు ఫైర్
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు ఇచ్చారు. బుధవారం ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు రోహిత్ కుటుంబ సభ్యులను కలిశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారికి రూ.5 లక్షల చెక్కును అందించారు. రోహిత్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు.
మంత్రి రావెల కిషోర్ బాబు రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోహిత్ కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా రావెల చెప్పారు. రోహిత్ తల్లికి, సోదరుడికి గురుకుల పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ పైన హరిబాబు ఆగ్రహం
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ పరుగెత్తుకొచ్చారని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, కానీ ఇలాంటి సంఘటనలను రాజకీయం కోసం వాడుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications