సొంత జిల్లా కడపలో జగన్‌కు టిడిపి షాక్?
కడప: కడప జిల్లాలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలుగుదేశం షాక్ ఇచ్చింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగన్ బంధువు తిరుపాల్‌రెడ్డి పదవికి గండం ఏర్పడింది. వైసీపీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లు దువ్వూరు సహకార సొసైటీకి రాజీనామా చేయడంతో అక్కడి పాలకమండలి రద్దయింది. దీంతో ఆ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ డీసీసీబీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తిరుపాల్‌రెడ్డి పదవికి ముప్పు వాటిల్లింది.
టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, వరదరాజుల రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసీపీకి దెబ్బకొట్టారు. గత కొద్దిరోజులుగా సహకార బ్యాంకు అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డిని పదవి నుంచి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గత నెల 16న జరిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకమండలి సమావేశానికి కోరం లేకుండా చేయడంతో సమావేశం జరగలేదు.

ఆ తరువాత ఇరు పార్టీల వారు డైరెక్టర్లను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ వచ్చారు. టీడీపీ నాయకులు వైసీపీకి ఊహకందని విధంగా డీసీసీబీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న దువ్వూరు సహకార సొసైటీనే రద్దు చేసే విధంగా పావులు కదిపారు.సహకారశాఖ నిబంధనల మేరకు సహకార సొసైటీ అధ్యక్షుడిగా తిరుపాల్‌రెడ్డి పదవి కోల్పోయిన తరుణంలో డీసీసీబీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అవకాశాలు లేవు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పీఠాన్ని తెలుగుదేశం పార్టీ చే జిక్కించుకునే ప్రయత్నం ప్రారంభమైంది
డీసీసీబీలో మొత్తం 21 డైరెక్టర్ స్థానాలు వుండగా ఒకదానికి ఎన్నిక జరగలేదు. మరొకరు చనిపోయారు. దీంతో 19 మంది డైరెక్టర్లు వున్నారు. వీరిలో 12 మంది వైసీపీకి వుండగా ఏడుగురు టీడీపీకి వున్నారు. మరో ముగ్గురిని చేరదీసుకునిటీడీపీ డీసీసీబీ పీఠాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications