బాబుకు 'బిగ్' షాక్, పోలవరంపై కేంద్రం తిరకాసు, మన్మోహన్ ప్రభుత్వం అంచనాల వల్లే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని మోడీ తీరుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అసహనంతో ఉంది. ప్రాజెక్టు కోసం 2014 తర్వాత అన్ని ఖర్చులు భరిస్తామని కేంద్రం చెప్పింది కానీ, దానిని చేతల్లో చూపించడం లేదంటున్నారు.

జగన్‌కు పులివెందుల నేత ఝలక్: మోసం చేశారని ఫిర్యాదు, 'తెలంగాణకు సీఎం షర్మిల'

రాష్ట్ర విభజన బిల్లులో ఈ ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు ఇస్తామని చెప్పింది. 2015 తర్వాత పోలవరం పనులు వేగం అందుకున్నా నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం మెలికలు పెడుతోందంటున్నారు. నిధుల నుంచి కాఫర్ డ్యాం వరకు కేంద్రం కొర్రీలు పెడుతోందంటున్నారు.

జగన్ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా, పరువుపోయింది: బాబు, మోడీపై అసహనం

పొలవరం ప్రాజెక్టుకు ఇలా కొర్రీలు

పొలవరం ప్రాజెక్టుకు ఇలా కొర్రీలు

మూడు రోజుల క్రితం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కాఫర్ డ్యాం నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ కొత్త కమిటీని నియమిస్తామని చెప్పింది. కాఫర్ డ్యాం అవసరమా లేదా ఈ కమిటీ తేలుస్తుందని చెప్పింది. అంతేకాదు, పనుల వరకే తాము బిల్లులు చెల్లిస్తామని, పునరావాసం, భూసేకరణకు సంబంధించి ఆర్థిక మంత్రి జైట్లీతో మాట్లాడాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

భూసేకరణపై ఇలా, మీరే తెచ్చారని చంద్రబాబు

భూసేకరణపై ఇలా, మీరే తెచ్చారని చంద్రబాబు

ప్రాజెక్టు భూసేకరణలో కేంద్రం కొర్రీలు పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో ఎకరాకు రూ.లక్షన్నర పరిహారం ఇస్తే ఇప్పుడు రూ.పదిన్నర లక్షలు ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కేంద్రం. అయితే 2013 భూసేకరణ చట్టం తెచ్చింది కేంద్రమేనని, కానీ అమలు బాధ్యత రాష్ట్రాలపై పడిందని చంద్రబాబు చెబుతున్నారు.

మన్మోహన్ ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్లే పెరిగిన అంచనా

మన్మోహన్ ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్లే పెరిగిన అంచనా

పోలవరం ప్రాజెక్టు అంచనా 2010-2011లో రూ.16,010 కోట్లు. 2014 ఏప్రిల్ నాటికి రూ.58 వేల కోట్లకు పైగా చేరింది. ఇందులో పునరావాసం ఖర్చే రూ.33 వేల కోట్లు. కేంద్రం 2013లో భూసేకరణ చట్టం మార్చినందునే వ్యయం భారీగా పెరిగింది. విభజన బిల్లు సమయంలో ఆ మొత్తం ఇస్తామని మంత్రిమండలి చెప్పింది.

వేల కోట్లు ఇవ్వాలి

వేల కోట్లు ఇవ్వాలి

అంతేకాదు, ఏపీకి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని, పోలవరం బాధ్యత తమదేనని జైట్లీ చెప్పారు. నాబార్డు ద్వారా కేంద్రమే పోలవరం రుణం ఇప్పించేందుకు సిద్ధమని చెప్పింది. నాబార్డు రుణ ఒప్పందం విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. విద్యుత్ కేంద్రానికి అయ్యే నిధులు ఇవ్వబోమని చెప్పారు. విద్యుత్ కేంద్రానికి అయ్యే నిధులు రూ.4,200 కోట్లు. అవి పోగా రూ.54వేల కోట్లకు పైగా ఇవ్వాలి.

కేంద్రం ఇస్తుందని భావించారు

కేంద్రం ఇస్తుందని భావించారు

ఆ మెమోలోనే 2010 - 2011 అంచనాల ప్రకారం పోలవరానికి ఇక రూ.5810 కోట్లు మాత్రమే తాము ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అందులో రూ.2981 కోట్లు విడుదల చేస్తున్నామని, మరో రూ.2829 కోట్లు ఇస్తామని తెలిపింది. అందులోనే 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరంపై నీటిపారుదల పనులకు అయ్యే ఖర్చుకు మాత్రమే కేంద్రం బాధ్యత ఉంటుందని తెలిపింది. తాజా అంచనాలు ఆమోదించే వరకే ఈ రూ.2829 కోట్ల పై చిలుకు చెల్లింపు వర్తిస్తుందని, ఆ తర్వాత పెంచిన అంచనాలు ఆమోదం పొందాక ఖర్చు చేసినంత ఇస్తారని అందరూ భావించారు.

డైలమాలో చంద్రబాబు ప్రభుత్వం

డైలమాలో చంద్రబాబు ప్రభుత్వం

నాటి అంచనాల ప్రకారం భూసేకరణ, పునరావాసానికి రూ.మూడు వేల కోట్లే కేటాయింపులు ఉన్నాయని, ఆ మొత్తం ఇచ్చినట్లేనని, పనులకు మాత్రమే బిల్లులు ఇస్తామని కేంద్రం మళ్లీ చెబుతోంది. ఆ తర్వాత అయితే పెంచిన అంచనాల ప్రకారం పునరావాసం, భూసేకరణకు చేసిన ఖర్చు ఇస్తారా? లేదా? అన్నది తెలియక చంద్రబాబు ప్రభుత్వం డైలమాలో ఉంది. అయితే తాజా అంచనాలు తయారు చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఓ వైపు పెంచిన పాత అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని చెబుతూ మళ్లీ తాజా అంచనాలు ఎందుకు సిద్ధం చేయమన్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ట్రాన్స్‌ట్రాయ్ పైన ఇలా

ట్రాన్స్‌ట్రాయ్ పైన ఇలా

ఆర్థిక కష్టాల్లో ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‍‌ను వద్దని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే కేంద్రమంత్రి వద్దని చెప్పారు. ట్రాన్స్‌ట్రాయ్‌తోనే పనులు పూర్తి చేయించాలని చెప్పారు. కొత్త టెండర్ల వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని, అంచనా వ్యయం పెరుగుతుందని, దానిని కేంద్రం భరించదని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ట్రాన్స్‌ట్రాయ్‌ను కొనసాగించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam government unhappy with Centre on Polavaram Project

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి