కేంద్ర బడ్జెట్ పై టీడీపీ రియాక్షన్ ఇదే..! కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఏమన్నారంటే..?
ఇవాళ పార్లమెంట్ లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర బడ్జెట్ ను స్వాగతించింది. పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు బడ్జెట్ ను స్వాగతిస్తూ వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానికి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం నిధులు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు… pic.twitter.com/CNbsH2owj6
— Lokesh Nara (@naralokesh) July 23, 2024
అటు టీడీపీకి చెందిన పౌరవిమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బడ్జెట్ ను స్వాగతించారు. తమ ప్రభుత్వంలో అమరావతి రాజధానికి నిధుల ప్రకటన రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని నిధులు ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించడాన్ని స్వాగతించారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా నిధులు ఇస్తామని చేసిన ప్రకటన కూడా శుభపరిణామం అన్నారు. ఐదుకోట్ల మంది ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకునే బడ్జెట్ ఇది అంటూ రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు.












Click it and Unblock the Notifications