మీ తప్పులు నా మీద వేసుకోను, 12 జిల్లాల్లో సభలు: నేతలకు బాబు క్లాస్

అమరావతి: గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాయకులు చేసే తప్పులను తన మీద వేసుకోనని ఆయన చెప్పారు. ఈ ఏడాది మహానాడును విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఏపీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై టిడిపి సమన్వయ కమిటీ సభ్యులతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లో కూడ ధర్మపోరాట సభలను నిర్వహించాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు.

గ్రూపులు కడితే సహించను

గ్రూపులు కడితే సహించను


పార్టీ నేతలు గ్రూపులు కడితే సహించేది లేదని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సూచించారు. ఎన్నికలు వస్తున్నందున పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. నేతలు తప్పులు చేస్తే వాటిని తన మీద వేసుకోనని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

విజయవాడలో మహానాడు

విజయవాడలో మహానాడు

ఈ నెల చివరి వారంలో మహనాడునువిజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. మహనాడుకు ముందుగానే జిల్లాల్లో మినీ మహనాడులను నిర్వహించనున్నారు. తిరుపతిలో జరిగిన సభ విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో కూడ ఇదే తరహలో బిజెపి ఏ రకంగా ఎన్నికల్లో హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. జూన్‌ మొదటి వారంలో నెల్లూరులో దళితతేజం సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఈనెల 14న గుంటూరులో మైనార్టీల సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సీఎం చంద్రబాబు హాజరవుతారని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు...జనవరి వరకు కొనసాగుతాయన్నారు. అమరావతిలో చివరి సభ నిర్వహిస్తామని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

లాలూచీ రాజకీయాలు

లాలూచీ రాజకీయాలు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు నేతలకు వివరించారు. కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని బిజెపి నేత గాలి జనార్ధన్ రెడ్డిపై ఈడీ ఉదారంగా వ్యవహరిస్తున్న విషయాన్ని బాబు ప్రస్తావించారు. మరో వైపు వైసీపీ చీఫ్ జగన్ పై ఈడీ ఇదే రకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు టిడిపి వర్గాలు తెలిపాయి.

బిజెపి, వైసీపీ సంబంధాలు వివరించాలి

బిజెపి, వైసీపీ సంబంధాలు వివరించాలి

బిజెపి,, వైసీపీల మధ్య సంబంధాలను ప్రజలకు వివరించాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. బిజెపి నేతలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దారి తీసిన పరిస్థితులను వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. వచ్చే రెండు మాసాల పాటు పార్టీ కార్యక్రమాలను నిర్ధేశించారు.ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగడుతూ ముందుకు సాగాలని బాబు పార్టీ నేతలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+