పొత్తులో బీజేపీకి సీట్ల మార్పు- ఏ స్థానంలో ఎవరు, రంగం సిద్దం..!?

ఏపీ పొత్తుల్లో ఆసక్తి కర నిర్ణయాలు జరుగుతున్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మూడు పార్టీల సీట్ల పైన ఢిల్లీ వేదికగా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ-జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయించింది. అందుకు ఆ రెండు పార్టీలు అంగీకరించాయి. ఇప్పుడు ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే చర్చల్లో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

ఎవరికి ఎన్ని సీట్లు
టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బీజేపీకి 6 ఎంపీ, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. బీజేపీకి కేటాయించే స్థానాల పైన టీడీపీ ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వగా...ఏ స్థానం ఫైనల్ చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా బీజేపీ నాయకులు విజయవాడ చేరుకున్నారు. పురంధేశ్వరి, పవన్‌తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయ్యింది. గజేంద్రసింగ్‌ షెఖావత్‌, జయంత్‌ పాండా, శివప్రకాష్‌ చర్చలు జరిపారు. అయితే నేడు మూడుపార్టీల మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననుండటంతో సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో అనకాపల్లి నుంచి ఆ పార్టీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు.

TDP Janasena and BJP to announce contesting seats and candidates in next two days

మార్పులు - చేర్పులు
బీజేపీ తమకు అనకాపల్లి స్థానంలో విశాఖ ఇవ్వాలని కోరుతోంది. అందుకు చంద్రబాబు అంగీకరించటం లేదు. దీంతో, అనకాపల్లి నుంచే బీజేపీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..జనసేన కాకినాడ, మచిలీ పట్నం స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక, ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన తమకు కేటాయించిన 24 లో ఇప్పటి వరకు 5 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి ఇచ్చే ఆరు స్థానాల పైన ప్రాధమికంగా నిర్ణయం జరిగింది. కానీ, బీజేపీ నుంచి మరో నాలుగు అసెంబ్లీ స్థానాల పైన ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే, బీజేపీకి అసెంబ్లీ స్థానాలు పెంచే అంశం పైన అధికారికంగా నిర్ణయం జరగాల్సి ఉంది. బీజేపీ విశాఖతో పాటుగా విజయవాడ స్థానం ఆశిస్తోంది. కానీ, టీడీపీ విజయవాడ స్థానం వదులుకోవటానికి సిద్దంగా లేదు.

నేడే నిర్ణయం
ఈ రోజు విజయవాడలో బీజేపీ కేంద్ర నాయకత్వంతో చంద్రబాబు, పవన్, పురందేశ్వరితో సమావేశం కానుంది. బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దులు ఖరారయ్యారు. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు రేసులో ఉన్నా..అక్కడ సీఎం రమేష్ పోటీకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. నర్సాపురంలో అభ్యర్ది ఎవరనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ అభ్యర్దుల పైన ఇక నిర్ణయానికి వచ్చారు. అయితే, ఈ సీట్ల విషయంలో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. దాదాపుగా ఈ రోజు చర్చల్లోనే ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనేది ఫైనల్ కానుంది. ఆ తరువాత మూడు పార్టీల అభ్యర్దుల విషయంలోనూ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఇవన్నీ నిర్ణయించి ఒకటి, రెండు రోజుల్లోనే తుది జాబితా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+