తిరుపతి ఉపఎన్నిక కోసం టీడీపీ వార్‌రూమ్ ప్రారంభం- హైటెక్ వ్యూహరచన కోసం
ఏపీలో త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో తిరుపతిలో పాగా వేసిన టీడీపీ కమిటీలు నియోజకవర్గాల వారీగా పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వీరితో నిరంతరం సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఇప్పుడు ఓ వార్ రూమ్‌ను కూడా సిద్ధం చేశారు.
తిరుపతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపఎన్నిక వార్ రూమ్‌ను తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. తిరుపతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల నేతలతో కలిసి అచ్చెన్నాయుడు వార్ రూమ్‌ను ప్రారంభించారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి హైటెక్ పద్దతిలో సమాచార మార్పిడి, సమాచార సేకరణ, సమన్వయం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని విషయాలనూ ఇక్కడే చర్చించి తుదిరూపు ఇవ్వనున్నారు.

ఈ వార్ రూమ్ నుంచే తిరుపతి ఉపఎన్నికకు సంబంధించిన సమాచారమంతా నేతలకు వెళ్లనుంది. అలాగే ఇక్కడ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల నేతల నుంచి 24 గంటలు , వారం రోజూలూ కాల్స్ స్వీకరించి ఫిర్యాదులు తీసుకునేందుకు, సమాచారం ఇచ్చేందుకు కూడా ఫోన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో పనిచేసిన రాబిన్‌శర్మ టీడీపీకి హైటెక్ వ్యూహాలు రచిస్తుండగా.. ఇందులో భాగంగానే ఈ వార్ రూమ్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video













Click it and Unblock the Notifications