నువ్వెంత నీ బతుకెంత, అంబేద్కర్ మాటలనే మరిచావా?: అంబికాకృష్ణ
అక్టోబర్ 2వ, తేది నుండి కంచ అయిలయ్యపై రెండో దశ ఆందోళనకంచ అయిలయ్యపై నిప్పులు చెరిగిన టిడిపి నేత అంబికా కృష్ణకంచ అయిలయ్య రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయాలన్న అంబికా కృష్ణ
ఏలూరు: ప్రోఫెసర్ కంచ అయిలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకంపై అక్టోబర్ రెండో తేది నుండి రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు టిడిపి నాయకుడు అంబికా కృష్ణ ప్రకటించారు.
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనల హోరు ఇంకా తగ్గలేదు. ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని నిత్యమూ ఎక్కడో ఒకచోట వైశ్య సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి

. తాజాగా ఏలూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ నేత అంబికా కృష్ణ, ఐలయ్యపై నిప్పులు చెరిగారు. ఐలయ్య పుస్తకంపై గాంధీ జయంతి నుంచి రెండో దశ ఉద్యమం మొదలు పెట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కంచ అయిలయ్య రాసిన పుస్తకంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబికా కృష్ణ డిమాండ్ చేశారు.
"న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ కట్టే వైశ్యులను అవమానిస్తావా? అంటూ అంబికా కృష్ణ నిప్పులు చెరిగాడు.. నువ్వెంత, నీ బతుకెంత? మీ అమ్మా, నాన్నలు నిన్ను చదివించినప్పుడు మావాడు మంచి ప్రయోజకుడు కావాలని చదివించి ఉంటారు. వాళ్లిప్పుడు బతికున్నారో లేదో తెలియదు. ఇప్పటి నీ స్థితిని చూస్తే వాళ్లు బాధపడతారని అంబికా కృష్ణ చెప్పారు.
దగ్గర దగ్గర నీకు 66 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో ఈ రాతలేంటయ్యా? అంబేద్కర్ చెప్పిన మాటలే మరిచావా? రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన చెప్పారు. కులాలు, మతాలు లేని దేశంగా ఈ భారతదేశం వెలుగొందాలని" అంటూ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications