బుద్ధా వెంకన్నకు బెయిల్: అర్ధరాత్రి హైడ్రామా

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విడుదల అయ్యారు. అర్ధరాత్రి పోలీసులు విడుదల చేశారు. స్టేషన్ బెయిల్ లభించింది. స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం విజయవాడకు చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు తాను ఇవ్వాళ సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

అంతకుముందు- బుద్ధా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుడివాడలో క్యాసినో ఏర్పాటు విషయంలో కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు, డీజీపీపై ఆరోపణలను గుప్పించిన నేపథ్యంలో పోలీసులు బుద్ధాను ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆరు గంటల పాటు విచారించారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను తీసుకున్న అనంతరం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.

ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ పట్టుబట్టారు. విచారణ అనంతరం విడిచిపెడతామంటూ పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. రాత్రి 11:30 గంటల సమయంలో బుద్ధాను విడుదల చేశారు. తాను ఏ పరిస్థితుల్లో కొడాలి నాని, డీజీపీపై విమర్శలు చేయాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు వివరణ కోరారని, తాను అన్నింటికీ సమాధానం ఇచ్చానని చెప్పారు.

చంద్రబాబు ఇంటి గేటు తాకితే.. కొడాలి నాని శవాన్ని పంపిస్తామంటూ బుద్ధా వెంకన్న హెచ్చరించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన.. అరగంటలోనే ప్రజలు ఆయనను చంపుతారని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌పైనా విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంటే పోలీసులు ఏం‌ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం ఇవ్వాలని నిలదీశారు.

TDP leader and Ex MLC Buddha Venkanna released on Station bail

క్యాసినో ఆడిన వారు, ఆడించిన వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టట్లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పని చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బుద్ధా వెంకన్న చెప్పారు. బుద్దా వెంకన్న అరెస్ట్‌‌ను పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్ తప్పుపట్టారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ప్రభుత్వం, పోలీసుల పనితీరుకు నిదర్శనమంటూ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+