వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారంలోకి రాగానే ఈసీ ప‌ని ప‌డ‌తాం: ఎన్నిక‌ల సంఘానికి సీఎం ర‌మేష్ హెచ్చ‌రిక‌..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల సంఘం పైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. చంద్ర‌గిరిలో రీ పోలింగ్ వ్య‌వ‌హారం పైన కేంద్ర ఎన్నిక‌ల సంఘ తీరును త‌ప్పు బ‌ట్టారు. విమ‌ర్శ‌ల స్థాయి దాటి అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. ఢిల్లీలో సీఎం ర‌మేష్‌..అమ‌రావ‌తిలో బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ ఎన్నిక‌ల సంఘాన్ని ల‌క్ష్యంగా చేసుకొని వ్యాఖ్య‌లు చేసారు. తాము అధికారంలోకి వ‌స్తే ఎన్నిక‌ల సంఘం ప‌ని ప‌డ‌తామ‌ని ర‌మేష్ హెచ్చ‌రించారు.

అధికారంలోకి వ‌స్తే విచార‌ణ త‌ప్ప‌దు..

టిడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎన్నిక‌ల సంఘం పైన విచార‌ణ చేయించి..వారి ప‌ని ప‌డ‌తామ‌నిన హెచ్చ‌రించారు. చంద్ర‌గిరి నియోజ‌కవ‌ర్గంలో ఎటువంటి నివేదిక‌లు లేకుండా రీపోలింగ్‌కు ఎలా అదేశిస్తార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఈ నిర్ణ‌యం పైనా తాము కోర్టుకు వెళ్తామ‌ని..పార్మ‌మెంట్‌లో విచార‌ణ‌కు డిమాండ్ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

రీపోలింగ్‌కు అదేశించిన అయిదు పోలింగ్ బూత్‌ల్లో టీడీపీకే ఓట్లు ప‌డ‌తాయ‌ని వివ‌రించారు. అదే స‌మ‌యంలో రీపోలింగ్‌కు భ‌య‌ప‌డుతున్నారా అని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా.. నీకు బుద్ది ఉండే అడుగుతున్నావా అని సీఎం ర‌మేష్ ఎదురు ప్ర‌శ్నించారు.

TDP Leader CM Ramesh serious allegations on CEC.. will not spare election commission

మోదీ..జ‌గ‌న్‌కు ఈసీ అనుకూలం..

సీఎం ర‌మేష్ ఢిల్లీలో ఆ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌గా..ఇక్క‌డ అమ‌రావతిలో టీడీపీ నేత బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ సైతం అదే త‌ర‌హాలో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌దాని మోదీ చెప్పు చేత‌ల్లో ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తుంద‌నే అనుమానాలు బ‌ల ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. ప్రధాని మోదీ, వైఎస్ జగన్‌కు పూర్తిగా కొమ్ము కాయడం వల్లే ఎన్నికల సంఘం వారికి అనుకూలంగా పని చేస్తోందన్నారు. ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవం, మర్యాద కూడా పోయాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కూడా ఎంతో వ్యత్యాసం చూపిస్తోందని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని.. ఇప్పటికైనా తీరు మార్చుకోక పోతే ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వాటిల్లుతుందని బూరగడ్డ చెప్పుకొచ్చారు. అయితే బూరగడ్డ వ్యాఖ్యలపై ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

English summary
TDP Leaders inappropriate comments on Central Election Commission. MP CM Ramesh and Buragadda Vedavyas says Election Commission lost credibility with this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X