టీడీపీకి షాక్ : ధూళిపాళ్ళ నరేంద్ర క్వాష్ పిటీషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీకి కీలక ఆదేశాలు
తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంగం డైరీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ధూళిపాళ్ల నరేంద్ర కు రిమాండ్ విధించింది.తనకు రిమాండ్ విధించడాన్ని హైకోర్టులో సవాలు చేస్తూ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్ దాఖలుచెయ్యగా ఈ కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

క్వాష్ పిటీషన్ కొట్టివేత , కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర దాఖలు తనపై ఎసిబి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టెయ్యాలని కోరుతూ నరేంద్ర తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో విచారణ కొనసాగించాలని ఏసీబీ అధికారులను ఆదేశించిన కోర్టు మే5వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.దీంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కోర్టులో చుక్కెదురైందని తెలుస్తుంది.

సంగం డెయిరీలో అవినీతి ఆరోపణలపై ధూళిపాళ్ళపై కేసు , రిమాండ్ ఖైదీగా టీడీపీ నేత
ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని , అవకతవకలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాదు సంగం డెయిరీలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అవకతవకలు జరిగాయని గుర్తించి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, దూళిపాళ్ల నరేంద్ర ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే కేసులోమరో ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ధూళిపాళ్ళ నరేంద్ర కోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. కోర్టు దానిని డిస్మిస్ చేసింది.

ధూళిపాళ్ళ అరెస్ట్ పై టీడీపీ ఫైర్ , సంగం డెయిరీ విషయంలో జగన్ సర్కార్ దూకుడు
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లతో సహా టిడిపి నేతలు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుపై మండిపడుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రతిపక్ష పార్టీల నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. సంగం డెయిరీని అమూల్ సంస్థకు అప్పజెప్పడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సంగం డెయిరీని ఏపీ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ, ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తూ సర్కార్ జీవో కూడా జారీ చేసింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications