Ganta Srinivas: గంటా శ్రీనివాస్ దారెటు ! చీపురుపల్లా ? టీడీపీకి గుడ్ బైనా..?

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సీటు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు పట్టుబడుతుండగా.. గంటా మాత్రం గతంలో గెలిచిన భీమిలి సీటులో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ చంద్రబాబు తాజాగా గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేసి తీరాలని తేల్చిచెప్పేశారు.

గతంలో అనకాపల్లి ఎంపీగా, విశాఖ నార్త్, భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్ మరోసారి భీమిలిలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉండటంతో ఆయన నియోజకవర్గం మారక తప్పని పరిస్దితి. అయితే గతంలో పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచిన చరిత్ర ఉన్న గంటాను ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి దింపితే బావుంటుందనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.

tdp leader Ganta Srinivas to take final call on his contest in Cheepurupalli today

కానీ చీపురుపల్లి ఎక్కువగా రూరల్ నియోజకవర్గం కావడం, అక్కడ పోటీ చేసి గెలిచినా భవిష్యత్తులో గుర్తింపు తెచ్చుకోవడం కూడా కష్టమేనని భావిస్తుండటం, అదే సమయంలో భీమిలి అయితే వైజాగ్ సిటీ నియోజకవర్గం కావడంతో గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దీంతో చీపురుపల్లిలో పోటీ చేయడమా లేక టీడీపీని వీడటమా అన్న అంశంపై ఇవాళ తన వర్గం నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు గంటా శ్రీనివాస్ సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+