అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు-విదేశాలకు రూ. 7 కోట్ల బియ్యం-పండక్కి జనం పస్తులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఒకప్పుడు వైసీపీ నేతగా ఉంటూ టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక అప్పుడప్పుడూ కనిపిస్తున్న జలీల్ ఖాన్.. ఇవాళ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆయన రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. పండుగనాడు ప్రజల్ని పస్తులుంచి, వారి జీవితాల్లో చీకట్లు నింపి పండుగ ఆనందాన్ని దూరంచేస్తున్న జగన్ రెడ్డి, రేషన్ బియ్యాన్ని తూతూమంత్రంగా పంపిణీ చేయిస్తూ, ఈ మూడున్నరేళ్లలో రూ.7వేలకోట్ల విలువైన పేదల బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించాడని ఆరోపించారు.

పాదయాత్రలో పచ్చి అబద్ధాలాడి, బుగ్గలు నిమిరి, తలపై చేతులుపెట్టి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని గుండుసున్నాచేశారని జలీల్ ఖాన్ విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో 95శాతం హామీలు నెరవేర్చానంటున్న జగన్, తన వ్యాఖ్యలకు కట్టుబడి, హామీల అమలుపై వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయగలడా అని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజల ముందుంచే ధైర్యం ఆయనకుందా అని అడిగారు. సొంత బాబాయ్ ని చంపిన వారిని కనిపెట్టలేని వ్యక్తి, ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా అని జలీల్ ప్రశ్నించారు.

tdp leader jaleel khan alleges jagan for pds rice illegal transport despite public hunger

పథకాలు, అభివృద్ధికి, ఆఖరికి జీతాలకు కూడా నిధులులేవని మంత్రులు అంటుంటే, నిధుల సమస్యలేదని చెబుతున్న ముఖ్యమంత్రి, డబ్బులు ఎక్కడున్నాయో సమాధానం చెప్పాలని జలీల్ ఖాన్ నిలదీశారు. ఎవరికీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇడుపులపాయలో దాస్తున్నాడా అని అడిగారు. గాలిలోపుట్టి, అబద్ధాలతో, మోసంపునాదులపై నెగ్గినవారు, భవిష్యత్ లో 175స్థానాలు గెలుస్తారా అని ప్రశ్నించారు. గడపగడపకు వెళ్తున్నవారిపై ప్రజలు ఉమ్మేస్తున్నారని, జనం దెబ్బకు భయపడే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నారన్నారు. తనతండ్రికి, తనకుటుంబానికి రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీకే జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడనే వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిదన్నారు. రాజకీయాల్లో అసలైన వెన్నుపోటుదారుడెవరంటే ముందుగా గుర్తొచ్చేది జగన్ రెడ్డేనన్నారు.

రేషన్ పంపిణీ పేరుతో ఉత్తబియ్యం ఇస్తే ప్రజలు సంతోషంగా పండుగ చేసుకోగలరా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. చంద్రబాబు పండుగలవేళ 10రకాల సరుకులతో కూడిన కిట్లు ప్రజలకు ఉచితంగా అందించారని, అలాచేయడం చేతగాదు కనుకనే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్, పండుగ సరుకుల పంపిణీని అవహేళన చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో కోటి 47లక్షల రేషన్ కార్డులుంటే జగన్ వాటిని కోటి 44 లక్షలకు తగ్గించాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమరవాణా జరుగుతుంటే పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ విభాగాలు ఏంచేస్తున్నాయని జలీల్ ప్రశ్నించారు.

వైసీపీఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు బాగోలేదంటున్న ముఖ్యమంత్రి తీరుచూస్తే చెప్పేవాడికి, వినేవాడికి బుద్ధిలేదన్నట్లుందని జలీల్ విమర్శించారు. బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి పనితీరే బాగోలేదంటున్న జగన్, ఇక ఇతరుల్ని ఏంచేస్తాడో చెప్పాల్సిన పనిలేదన్నారు. కోర్టుల ద్వారా జగన్ రెడ్డికి పడినన్ని చీవాట్లు, మొట్టికాయలు దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా పడ్డాయా అని జలీల్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిస్థానంలో మరొకరుంటే సిగ్గుతో ఉరివేసుకునేవారన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఆగ్రహావేశాలతో ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలు, ఈ ప్రభుత్వం చేసిన దసరా ఉత్సవాల నిర్వహణకు అద్దం పట్టాయనే చెప్పాలన్నారు.

పంటలుపండే భూముల్ని రాజధానికి త్యాగం చేసినవారిని అవమానించి, ఆనందిస్తున్న వారికి సిగ్గుందా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండటాన్ని స్వాగతించినవారు, ఇప్పుడెందుకింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిలదీసారు. అన్నంపెట్టే 33వేల ఎకరాల భూముల్ని ఉచితంగా ఇచ్చారని చెబితే స్వయంగా ప్రధానమంత్రే ఆశ్చర్యపోయారని, పెయిడ్ ఆర్టిస్టులంటూ రాజధాని రైతుల్ని తూలనాడుతున్న బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్ ఇన్నేళ్లలో వారికున్న రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్రకు ఏంచేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వారు, మూడు రాజధానులు నిర్మిస్తారా? వారిద్దరేకాదు, ఇతర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? రైతుల్ని అవమానించినవారికి ఎప్పటికైనా అన్నదాతల ఉసురు తగలకతప్పదన్నారు.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏమన్నారో తెలియడంలేదా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు, తెలంగాణ వారితో పెట్టుకుంటే ఏమవుతుందో వైసీపీ వారికి బాగాతెలుసన్నారు. చంద్రబాబు చేసిందేమిటో, ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజనానంతర రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిచేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఇప్పుడున్న ఈ జగన్ రెడ్డి, ఆయన మంత్రుల్లాగా మట్టి, నీరు, ఇసుక, భూములు, ఖనిజసంపద అమ్ముకోలేదని, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్తేమీ కాదని, ఆయన ఆలోచన ప్రజల గురించి, రాష్ట్రం గురించేనని తెలుసుకోండన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు అనుభవిస్తున్నది అంతా ఆయనఆలోచనలు, అభివృద్ధి ఫలితమేనన్నారు. మహానుభావుడైన ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకుపెడితే అదేగొప్ప విషయమా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు.

English summary
tdp leader jaleel khan on today alleged ys jagan regime for illegally transporting pds rice without giving public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X