బొత్సా మాట్లాడితే కుక్కకు కూడా అర్ధం కాదు .. జనం ఛీ అనేలా వైసీపీ మంత్రుల ప్రవర్తన : జలీల్ ఖాన్
Recommended Video
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై , మండలిలో వైసీపీ మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. శాసనమండలిలో వైసీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాలేదని ఆయన మండిపడ్డారు. జనం ఛీ కొడుతున్నారని జలీల్ ఖాన్ పేర్కొన్నారు .
ఇక శాసనమండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా సభలో అనుచితంగా మంత్రులు ప్రవర్తించినందుకు టిడిపి నాయకుడు జలీల్ ఖాన్ మంత్రులు బొత్సా సత్యనారాయణ, కొడలి నానీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . మాజీ ఎమ్మెల్యే కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ నిర్ణయాలను సమర్థించిన జలీల్ ఖాన్ మండలి నిర్ణయం చట్టబద్దంగా జరిగిందని పేర్కొన్నారు. బొత్సా సత్యన్నారాయణను అవినీతి రాజకీయ నాయకుడిగా పేర్కొన్నారు. అతను ఏమి మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదని చెప్పి బొత్సా సత్యన్నారాయణను ఎగతాళి చేశాడు.

బొత్సా మాట్లాడితే కుక్కకు కూడా అర్ధం కాదని చెప్పారు జలీల్ ఖాన్ . కనీసం ఇంట్లో భార్యకు అయినా ఆయన భాష ఏం అర్ధం అవుతుందో అని ఆయన హేళన చేశారు. బొత్సా అంటే ముస్లిమ్స్ భాషలో చిప్ప అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని విమర్శించినందుకు జలీల్ ఖాన్ కొడాలి నానీపై మండిపడ్డారు . చంద్రబాబు వయస్సు మరియు అనుభవానికి గౌరవం ఇవ్వమని అతను నానికి సలహా ఇచ్చారు.షర్టు బటన్స్ తీసేసి రౌడీల్లా ప్రవర్తిస్తే బాగోదని చెప్పారు. ప్రజలంతా చూస్తున్నారని , అంతా వైసీపీ నాయకులను ఛీ కొడుతున్నారని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications