త్వరలో జేసీ బయోపిక్ -పేరు, పూర్తి వివరాలు ఇవే..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఆ తర్వాత విభజన జరిగినా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన అనంతపురం జిల్లా నేత జేసీ దివాకర్ రెడ్డికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ గత రెండు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నారు. అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా అప్పట్లో తాడిపత్రి కేంద్రంగా సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన చేసిన రాజకీయం మాత్రం ఓ చరిత్రే.
ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కబోతోంది. రాజకీయాల్లో ముక్కు సూటిగా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా నిలిచే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరిత్రపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "జూటూరు రాజు"గా పేరు కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో జే.సీ.దివాకర్ రెడ్డి పాత్రను టాలీవుడ్ దిగ్గజ నటుడు రాజేంద్రప్రసాద్ పోషించనున్నట్లు కూడా సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు తెరకెక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన వర్క్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు.
ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మరోవైపు జేసీ కుమారుడు పవన్ అనంతపురం ఎంపీగా ఉన్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. బయోపిక్ లో వీరి పాత్రలు కూడా ఉంటాయా లేదా అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications