మత్తయ్య కేసులో సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు, 'రెండ్రోజులుగా.. రేవంత్‌పై కక్షనే'
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య కేసులో సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మత్తయ్య, అతని భార్య, సోదరుడు, స్నేహితుడికి చెందిన కాల్ డేటా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మే 1 నుంచి జూన్ 20 వరకు కాల్ డేటాను జూలై 1లోపు సమర్పించాలని ఆదేశించింది.
కేసీఆర్ పైన మండిపడ్డ కాల్వ
తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ ప్రభుత్వ చీఫ్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఏడాదిలో ఒక అవగాహనకు రానందున పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తమకే చెందుతాయనడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ కేసీఆర్ ఫాంహౌస్ కాదన్నారు. ఉమ్మడి రాజధాని అనే విషయం గుర్తించాలన్నారు. ఏపీకి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, వాటి గుట్టు రట్టవుతుందని చెప్పారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం పని అని తెలంగాణ టీడీపీ నేత పాల్వాయి రజనీ కుమారి ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అవినీతికి పాల్పడినందునే అప్పట్లో మంత్రి పదవి ఊడిందన్నారు.
తన కొడుకు చేసే ఇసుక దందాల మద్దతు కోసమే పోచారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎంపీ కల్వకుంట్ల కవిత ఎప్పుడో నిజామాబాద్ నుండి పోచారంను పంపించేశారన్నారు. రైతుల ఆత్మహత్యలు పోచారంకు పట్టవా అని నిలదీశారు.
అంతర్ రాష్ట్ర సమస్యలు, నదీ జలాల వివాదాలు, ప్రభుత్వ పాలసీల పైన కేసులు ఉంటేనే అడ్వోకేట్ జనరల్‌లు వాదిస్తారని, కానీ రేవంత్ రెడ్డి కేసులో రెండు రోజులుగా ఏజీ కోర్టులోనే ఉన్నారని, రేవంత్ పైన ప్రభుత్వం కక్ష సాధింపుకు ఇదే నిదర్శనమని చెప్పారు.












Click it and Unblock the Notifications