వైసిపి లో చేరిన మోదుగుల: తన్నులు తిన్నా గుర్తించలేదు : గుంటూరు ఎంపీగా బరిలోకి..!
టిడిపి నేత మోదుగుల వేణు గోపాల రెడ్డి వైసిపి లో చేరారు. ఆయనను వైసిపి అధినేత జగన్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఆయన వెంట గంటూరు జిల్లా వైసిపి నేతలు ఉన్నారు. మోదుగుల వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుండి పోటీ చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. జగన్ అవకాశం ఇస్తే గుంటూరు నుండి జయదేవ్ పై పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్ర కోసం లోక్‌సభ లో తన్నులు తిన్నా గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
వైసిపి లో చేరిన మోదుగుల..
టిడిపి నుండి 2009 లో నర్సరావుపేట ఎంపీగా..2014 లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగు ల వేణుగోపాల రెడ్డి టిడిపిని వీడి వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయన చేరిక పై ప్రచారం జరుగుతున్నా అధికార కంగా ఈ రోజు చేరారు. జగన్ తనను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయమని సూచిస్తూ తాను అక్కడి నుండి బరి లోకి దిగుతానని స్పష్టం చేసారు. అదే సమయంలో టిడిపి మీద మోదుగుల ఫైర్ అయ్యారు. తాను సమైక్యాంధ్ర కోసం ఉత్తరాది ఎంపీలతో తన్నులు తిన్నా..తనను టిడిపి గుర్తించలేదన్నారు. తనను తన్నిన వారితోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. తన పై ఆరోపణలు చేసి..రాష్ట్ర విభజన కు కారణమైన కమల్ నాధ్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే సీయం ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లాలో టిడిపి లేకుండా చేస్తా..
తనకు వ్యక్తిగతంగా టిడిపి మీద ద్వేషం లేదని చెప్పిన మోదుగుల..గుంటూరు జిల్లాలో టిడిపి లేకుండా చేయటమే తన లక్ష్యమని చాటారు. తన లాగా ఎటువంటి మచ్చ లేకుండా ..రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తికి సీటు ఇవ్వకపోవటం టిడిపి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. హైదరాబాద్‌ను రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు.ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.
గుంటూరు ఎంపీగా బరిలోకి..!
గుంటూరుకు గల్లా జయదేవ్ గుంటూరుకు అతిథిలాంటి వారని ఎద్దేవా చేశారు. గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని, బ్యాలెట్ ద్వారా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మోదుగుల ఎంపీగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన గుంటూరు ఎంపీగా బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే సమాచారం అందుతోంది. మోదుగుల వైసిపి లో చేరిక కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. తాను గుంటూరు వెళ్లిన తరువాత టిడిపికి సంబంధించి మరిన్ని విషయాలను వెల్లడి స్తాన్నారు మోదుగుల వేణు గోపాలరెడ్డి.












Click it and Unblock the Notifications