కాల్‌మనీ దందా: పగో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రమేయం?

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కాల్‌మనీ వ్వవహారం ఒక్క విజయవాడకే పరిమితమనుకుంటే పొరపాటేననంటున్నారు పోలీసులు అధికారులు.

తాజాగా ఈ కాల్‌మనీ వ్యవహారంలోకి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్ మనీ దందాలో బాపిరాజు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

అంతేకాదు కాల్‌మనీ గ్యాంగ్‌లో ఏ6 నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ బాపిరాజుకు అత్యంత సన్నిహితుడు. అతని పేరుతోనే ఈ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఎంబీఏ చదివినప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు.

 Tdp leader Mullapudi bapiraju in call money issue

నల్లజర్ల మండలం సోమాలమ్మ ఆలయం వద్ద ముళ్లపూడి వర్గీయులు గతంలో వేసిన రియల్ వెంచర్‌లో కూడా పెండ్యాల శ్రీకాంత్ స్లీపింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ముళ్లపూడి రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీకాంత్ చూస్తుంటాడనే ప్రచారం సాగుతోంది.

ముళ్లపూడి బాపిరాజు పశ్చిమ గోదావరి జల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాపిరాజుకు వాహనం ఇచ్చిన తర్వాత గతంలో తాను వినియోగించిన ఇన్నోవా కారును శ్రీకాంత్‌కే ఇచ్చేశారు. ఆ ఇన్నోవా కారులోనే శ్రీకాంత్‌ తిరుగుతూ ఈ కాల్‌మనీ దందాను చక్కబెతుడుంటాడని సమాచారం.

కాల్‌మనీ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ పట్టుబడితే ముళ్లపూడి బాపిరాజు పాత్రపై స్పష్టత వస్తుందని కాల్‌మనీ కేసు పర్యవేక్షిస్తున్న విజయవాడ మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం పెండ్యాల శ్రీకాంత్ పరారీలో ఉన్నాడని ఆయన సోమవారం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+