Nara Lokesh1000 : 1000 కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్
టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది. ఈ ఏడాది జనవరిలో కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో వెయ్యి కిలోమీటర్ల మార్క్ దాటింది. ఇవాళ ఆదోనిలో పాదయాత్ర చేసిన లోకేష్.. ఈ కీలక మైలురాయి దాటారు. ఇవాళ మొత్తం 14.1 కిలోమీటర్లు నడిచిన లోకేష్.. మొత్తం 1004.8 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.
ఆదోనిలో ఇవాళ పాదయాత్ర కొనసాగించిన నారా లోకేష్ వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఆదోనిలో 21వ వార్డును దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలోమీటర్లకు గుర్తుగా శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఆదోని 21వ వార్డులో జనం మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వార్డును దత్తత తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు.

ఆదోనిలోని కడికొత్త క్రాస్ వద్ద మాట్లాడిన లోకేష్.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను గుర్తుచేశారు. రాష్ట్రమంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తెస్తానన్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన కరెంటు, ఆర్టీసీ ఛార్జీలతో జనం ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ తెలిపారు. అటు నిరుద్యోగుల కోసం జగన్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే పరిష్కారం అని నారా లోకేష్ తెలిపారు. మరోవైపు లోకేష్ చేస్తున్న పాదయాత్ర రేపు రంజాన్ పండుగ రోజు కూడా కొనసాగనుంది. అలాగే ఆదివారం కూడా యాత్ర కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications