Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులపై రాళ్లు: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ: ఎయిడెడ్‌పై రచ్చ: లోకేష్ ఆగ్రహం

అనంతపురం: రాష్ట్రంలో ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది.. రక్తసిక్తమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. లాఠీఛార్జీలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తప్పు పట్టారు.

ఎస్ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులపై..

ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కొద్దిరోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలను వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసింందే. ఇందులో భాగంగా అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన జీవోలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్..

ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్..

ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల నాయకులు ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రదర్శనలను నిర్వహించారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ రెండింటి విలీనాన్ని ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను విద్యాశాఖకు అందజేసింది.

విలీనాన్ని వ్యతిరేకిస్తూ..

విలీనాన్ని వ్యతిరేకిస్తూ..

దీని పట్ల ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు, విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రైవేటు పరం చేస్తే ఫీజుల భారం మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. దీనితో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎవరో రాళ్లు రువ్వితే..

ఎవరో రాళ్లు రువ్వితే..

అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు. ఎవరో రాళ్లు రువ్వారనే కారణంతో తమపై లాఠీఛార్జీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము రాళ్లు రువ్వలేదని, ప్రశాంతంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేస్తోన్నారు.

జగన్ రెడ్డి అహంకారం..

జగన్ రెడ్డి అహంకారం..

కాగా- అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని విమర్శించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

రాజారెడ్డి రాజ్యాంగం అంటూ..

రాజారెడ్డి రాజ్యాంగం అంటూ..

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లను సంధించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+