మా బాబాయ్‌ని మా అబ్బాయ్ ఏసేస్తే మీకెందుకబ్బా: నారా లోకేష్..పుష్ప సీన్ ప్లస్ డైలాగ్

కడప: రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తెలుగుదేశం పార్టీ తన విమర్శలను మరింత తీవ్రతరం చేసింది. ఈ హైప్రొఫైల్ హత్యకేసు విషయంలో ఎప్పటికప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలను చేస్తూనే వస్తోంది. ఈ విషయంలో టీడీపీ ఓ విజయాన్ని సైతం సాధించింది. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిని బదిలీ చేయించే విషయంలో సక్సెస్ అయింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితులు కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్నారని, వారికి ప్రాణహాని ఉందని సీబీఐ అధికారులకు లేఖ రాసింది. టీడీపీ పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య ఈ లేఖను రాశారు. ఆ తరువాత వరుణ్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఒంగోలుకు ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం. అక్కడ విధుల్లో ఉన్న ప్రకాష్‌ను కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా అపాయింట్ చేసింది.

TDP leader Nara Lokesh slams CM YS Jagan over YS Viveka murder case

ఇవ్వాళ కూడా తెలుగుదేశం పార్టీ- వైఎస్ వివేకా హత్యను ప్రస్తావించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యోదంతంలో వైఎస్ జగన్ ప్రమేయం ఉందంటూ విమర్శనాస్త్రాలను సంధించింది. బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేయించింది అబ్బాయ్ వైఎస్ జగనే అంటూ ప్రచారాన్ని మొదలు పెట్టింది. దీనికి- అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ పుష్ప సినిమాలోని సన్నివేశాన్ని వినియోగించింది.

దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బాబాయ్ మావోడే..అబ్బాయ్ మావోడే.. గొడ్డలి మాదేనంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఉన్న క్లిప్ ఇది. వైఎస్ వివేకా హత్యకు గురైన తరువాత గుండెపోటుతో మరణించినట్లు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినట్లు విమర్శించారు. వైఎస్ వివేకాది గుండెపోటు కాదని, వైఎస్ జగన్ వేసిన గొడ్డలిపోటు అంటూ ఆరోపించారు.

Recommended Video

    YS Sharmila : అప్పట్లో YSR అద్భుతాలు చేస్తే ఇప్పుడు KCR మోసాలు చేస్తున్నారు | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+