జూ ఎన్టీఆర్ కు లోకేష్ కంగ్రాట్స్ - వాటికి సమాధానంగానే : తొలి అడుగు పడినట్లేనా...!!
హీరో జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ నేత లోకేష్ కంగ్రాట్స్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ .. రాం చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీని పైన లోకేష్ స్పందించారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేసారు. 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు - లోకేష్ అభినందనలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ - లోకేష్ ట్వీట్ వైరల్
మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఈ వారం కుటుంబసమేతంగా సినిమాను చూస్తానని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి, తారాగణానికి 'నా హృదయపూర్వక శుభాభినందనలు' అని పేర్కొన్నారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అయితే, ఇప్పుడు లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తారక్ పార్టీలోకి ఎంట్రీ విషయం పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో ఎన్టీఆర్ అభిమానులు తారక్ ను పార్టీలోకి తీసుకురావాలని..ప్రచారానికి పంపాలని డిమాండ్ చేసారు. కానీ, చంద్రబాబు నుంచి ఆ సమయంలో స్పందన రాలేదు.

రాజకీయ సమీకరణాల నేపథ్యంలో
ఆ తరువాత మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటన సమయంలోనూ ఇదే తరహాలో సీన్ చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారు సైతం జూనియర్ పార్టీకి అవసరమంటూ వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు లో తన సతీమణిని అవమానించారంటూ చంద్రబాబు కన్నటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో నందమూరి కుటుంబం మొత్తంగా వైసీపీ నేతల పైన ఫైర్ అయ్యారు. బాలయ్య సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేసారు. అందులో వైసీపీ నేతలను ఒక్క మాట కూడా అనకపోవటం పైన టీడీపీ నేత వర్ల రామయ్య లాంటి వారు కీలక వ్యాఖ్యలు చేసారు.

లోకేష్ వ్యూహాత్మంగానే ఇచ్చారా
ఇక, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపు అంశంలో చిరంజీవి.. మంత్రులు పేర్ని నాని..కొడాలి నాని సహకరించారని సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం పరోక్షంగా పొత్తు పైన జనసేన ఆవిర్భావ సభ నుంచి సంకేతాలు ఇచ్చారు. దీంతో.. లోకేష్ సైతం కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. ముందుగా నందమూరి కుటుంబం మొత్తం తమకు మద్దతుగా ఉందనే సంకేతాల ద్వారా.. వైసీపీ ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు.. బాలయ్య కోరిన విధంగా హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించే అంశం పైన సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటు తారక్ - అటు చెర్రీకి ఒకసారి
దీంతో... లోకేష్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో చాలా పాజిటివ్ గా స్పందించారు. భీమ్లానాయక్ విడుదల సమయం లోనూ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందంటూ చంద్రబాబు - లోకేష్ విమర్శించారు. ఇప్పుడు లోకేష్ తమ లక్ష్యం -2024 లో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీ పైన అందునా.. జూనియర్ - చెర్రీ లపైన ప్రశంసలతో అటు జూనియర్ ఎన్టీఆర్ - మెగా ఫ్యామిలీకి సానుకూల సంకేతాలు పంపినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, లోకేష్ ఆర్ఆర్ఆర్ మూవీ పైన చేసిన ట్వీట్లు ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications