బాహుబలి టిక్కెట్లు: ఏపీ మంత్రి కార్యాలయ వర్గాల స్పందన!
విశాఖ: ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ తదితరులు ప్రధానపాత్రలుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా బ్లాక్ టిక్కెట్ల పైన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కార్యాలయం శుక్రవారం స్పందించినట్లుగా తెలుస్తోంది.
బ్లాక్ టిక్కెట్ల పైన కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పింది. విశాఖ జిల్లాలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టిక్కెట్లు ఎన్నో రెట్లు ఎక్కువకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్ టిక్కెట్ విక్రయాలు బాగా జరుగుతున్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.25 టిక్కెట్లు రూ.1000కి, రూ.50 టిక్కెట్లు రూ.2వేలు అంతకు మించి విక్రయిస్తున్నారని అంటున్నారు. భారీ సినిమా విడుదల నేపథ్యంలో చాలామంది సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపణల వస్తున్నాయి.












Click it and Unblock the Notifications