చంద్రబాబుపై తీవ్ర విమర్శలు: సోము వీర్రాజు వీడియో ట్వీట్‌పై పనబాక లక్ష్మి స్పందన
అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోషల్ మీడియాలో షేర్ చేసిన చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి పనబాక లక్ష్మి చేసిన కామెంట్లు ఆ వీడియోలో ఉన్నాయి.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్తిగా బరిలోకి దిగిన పనబాక లక్ష్మి.. ఆ వీడియోపై స్పందించారు. తనపై సోము వీర్రాజు పోస్టు చేసిన వీడియో మార్ఫింగ్ చేసిందని, ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అంతేగాక, ఆ వీడియోను సోషల్ మీడియాలో, చిన్న ఫోన్లలోనే కాదు, 70 ఎంఎం స్క్రీన్ మీద కూడా సోము వీర్రాజు వేసుకోవచ్చని పనబాక లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదని వివరణ ఇచ్చారు.
ఆ వీడియోపై తాను పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వెంట ప్రజలు ఉన్నారని, అది తమకు చాలని ఆమె వ్యాఖ్యానించారు. అనలేదని వివరణ ఇచ్చిన పనబాక లక్ష్మి.. మా వెంట ప్రజలు ఉన్నారు... అది మాకు చాలు అన్నారు.. ఆ వీడియోపై నేను పార్టీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు పనబాక లక్ష్మి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు.
తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీ గారు టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. సమర్పిస్తున్న తెలుగుదేశం @JaiTDP.#BJP4Tirupati#BJP_JanaSena4AndhraPradesh@PanabakaLakshmi pic.twitter.com/t5Q5zJj6hz
— Somu Veerraju (@somuveerraju) March 30, 2021
కాగా, సోము వీర్రాజు పోస్టు చేసిన ఆ వీడియోలో పనబాక లక్ష్మి.. చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు అనకొండలు కనిపించలేదా? అని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications