కొలికపూడి వివాదంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!!
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలంగా కొలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టాయి. సీఎం చంద్రబాబు ఈ వివాదం పైన కమిటీ నియమించారు. ఆ కమిటీ కొలికపూడిని విచారించి నివేదిక సమర్పించింది. కాగా, తిరిగి ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వద్దని ఎమ్మెల్యే కొలికపూడికి తేల్చి చెప్పింది. అయితే.. తాజాగా ఆయన పెట్టుకున్న ఫోన్ స్టేటస్ మరోసారి వివాదం గా మారింది. దీంతో, చంద్రబాబు సీరియస్ అయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి పార్టీ నాయకత్వం ఈ రోజు ఘాటు హెచ్చరిక చేసింది. కొలికపూడి గతంలో ఎంపీ చిన్ని లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలో పార్టీలో కలకలం రేపాయి. విజయవాడ పార్టీలో చిన్ని వర్సస్ కొలికపూడి పంచాయితీ హైకమాండ్ వద్దకు చేరింది. దీంతో.. ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు. దీంతో.. పార్టీ నేతలు ఈ ఇద్దరి నుంచి వివరణ తీసుకున్నారు. భవిష్యత్ లో మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించారు. అయితే, తాజాగా కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారు. ఆయన తన స్టేటస్ గా పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో అసెంబ్లీ లాబీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడారు. ఘాటు హెచ్చరిక చేసారు.

వాట్సప్ స్టేటస్ పై పార్టీ నాయకత్వం ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఇక ఉపేక్షించే అవకాశం లేదని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోతే ఎలా అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరయి వివరణ ఇచ్చినా మార్పు రాలేదని పల్లా ఆక్షేపించినట్లు సమాచారం. అయితే, తనకు ఎలా నడుచుకోవాలో సీనియర్లు చెబితే బాగుంటుంది అంటూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజాగా ఆయన వాట్సాప్ లో పెట్టుకున్న స్టేటస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. మూడు రోజుల్లో తాను ముప్ఫయి ఐదు గ్రామాలను పర్యటించానని, 485 కుటుంబాలతో ఆత్మీయ కలయికను చేపట్టినట్లు స్టేటస్ లో తెలిపారు. ఇంతటి తో ఆగకుండా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు.. పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. త్వరలోనే కీలక నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. కొత్త నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో.. సీఎం చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications