జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు
అమరావతి: చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు.
నంద్యాల ఉపఎన్నిక కోసం తెలుగుదేశం ప్రభుత్వంలోని మంత్రులందరూ రోడ్లపై తిరుగుతారన్న జగన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. తమకేమీ కొమ్ములు రాలేదని, ప్రచారం కోసం తప్పకుండా రోడ్లపై తిరుగుతామని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా జగన్ తయారు చేసి ఇచ్చిన స్క్రిప్ట్ లు చదువుతోందని, నంద్యాల ఉపఎన్నికను వైసీపీ డబ్బుమయం చేస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. అసలు శిల్పా సోదరులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేసింది టీడీపీయేనని అన్నారు.












Click it and Unblock the Notifications