మంత్రి రోజా చరిత్ర తెలుసుకొని మాట్లాడండి

ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని, ఏం మాట్లాడుతున్నారని తెలుగు మహిళా ఏపీ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రోజాకు మద్దతుగా మాట్లాడుతున్న హీరోయిన్లు.. పవన్ కల్యాణ్ భార్య గురించి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రోజా చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని, లేదంటే ప్రజల నుంచి ఛీత్కారం పొందుతారని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి మద్యపాన నిషేధంపై మాట తప్పడంతోపాటు మడమ తిప్పారన్నారు. మద్యం ద్వారా రూ.94వేల కోట్లను నాలుగు సంవత్సరాల కాలంలో దోచుకున్నారని, జే బ్రాండ్స్ లో విషతుల్యాలే ఎక్కువున్నాయని తాము నిరూపిస్తే తిరిగి తమ పార్టీవారిపైనే కేసులు పెట్టారన్నారు. మద్యం సేవించినవారి కాలేయం చెడిపోతోందని, ప్రజలు జబ్బులపాలవుతుంటే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికీ డాక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంతమందికి సక్రమంగా మందులు అందిస్తున్నారో శ్వేతపత్రం ద్వారా చెప్పాలని సవాల్ విసిరారు.

tdp leader vangalapudi anitha latest comments

ప్రజల రక్త మాంసాన్ని మద్యం ద్వారా తింటున్నారని, నాసిరకం మద్యం ద్వారా ప్రాణాలు పోతున్నాయని, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. ఓట్లు అడుగుతామని అన్నారని.. ఆ దమ్ము జగన్‌కు ఉందా అని అనిత ప్రశ్నించారు. జగన్ మద్యం బ్రాండ్‌లలో విషతుల్యం ఉందని.. లేబరేటరీలో నివేదికలు అవే చెబుతున్నాయని, కల్తీ మద్యం తాగినవారికి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయన్నారు. నాలుగు సంవత్సరాల్లో ఎన్నో పుస్తెలు తెగాయని, తాగుడుద్వారా వచ్చే డబ్బులతో సంక్షేమం చేస్తున్నామని అంటారా? అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+