నీకు ఆ సీఎం పదవి ఎందుకు దండగ? దిగిపో జగన్: మండిపడిన వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా మారిందని టిడిపి నాయకులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే అనేక నిధులను రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించడంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడుతున్నారు. వివిధ పథకాలకు రాష్ట్రం వాటాలు కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో ఏపీ ఫండ్స్ పై కేంద్రం అసహనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల వ్యవహారంపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రం తీరుపై అసహనం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులను కేటాయించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. అందుకు ఏపీ ప్రభుత్వ వైఖరి కారణమని స్పష్టం చేసింది. నూతన రైల్వే ప్రాజెక్టులను కేంద్రం, రాష్ట్రాలు భరించే ప్రాతిపదికన చేపడుతున్నామని, ఇటీవల పార్లమెంటు సమావేశాలలో ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వక పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సహకరించేలా నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులైనా ముందుకు వెళ్తాయని, ఆ దిశగా వైసీపీ ఎంపీలు కృషి చేయాలని కేంద్ర మంత్రి సూచించారు.

పేద గర్భిణులకు ఆర్థిక సహాయం అందించే పథకానికి నిధులివ్వని రాష్ట్రం
ఇక తాజాగా పేద గర్భిణులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ములు చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది అని పెండింగ్లో ఉన్న వాటా సొమ్మంతా చెల్లిస్తే తరువాత కేంద్రం నిధులు ఇచ్చే సంగతి చూస్తామని వెల్లడించింది. దీంతో పేద గర్భిణీలకు ఆర్థిక సహాయం అందించే పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే గండి పడినట్టుగా కేంద్రం చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతోంది.

వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న టీడీపీ
ఇక దీనిపై మండి పడుతున్న టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రదర్శిస్తున్న అసహనం నేపథ్యంలో జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి అని పార్లమెంట్ లో కేంద్రాన్ని అడిగితే వచ్చిన సమాధానం.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రం వాటా ఇవ్వట్లేదు అని, అందుకే ముందుకు సాగట్లేదు అని పేర్కొన్న వంగలపూడి అనిత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు .

గర్భిణీలకు సాయం చెయ్యలేని సీఎం జగన్ ఎందుకు ?వంగలపూడి అనిత
ఇక ప్రస్తుతం గర్భిణీలకు సాయం పరిస్థితి ఏమిటి అని అడిగితే, రాష్ట్రం వాటా ఇవ్వట్లేదు అని చెబుతున్నారు అంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇదే సమయంలో సీఎం జగన్ ని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత ఇంక నీకు ఆ సీఎం పదవి ఎందుకు దండగ? దిగిపో అంటూ జగన్మోహన్రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహిళల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకోవటం తప్ప మహిళలకు జగన్ చేస్తుంది ఇదేనా అంటూ ఆమె విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి జగన్ ను టార్గెట్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications