చంద్రబాబుకు ముప్పు ఉంది- సాయుధ భద్రత కల్పించాలి: డీజీపీకి లేఖ..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ముప్పు ఉందంటూ పార్టీ డీజీపీకి లేఖ రాసింది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీకి రాసిన లేఖలో మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం చంద్రబాబు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా కార్యక్రమాలకు హాజరవుతారని వివరించారు.

సంఘవిద్రోహ శక్తుల ముప్పు
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో సహా టీడీపీ సీనియర్ నాయకులు కూడా పార్టీ కార్యాలయంకు హాజరవుతున్నారని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తుంటారని వివరించారు. మాజీ ముఖ్యయమంత్రి చంద్రబాబు ఎన్ఎస్జీ తో గల జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన నాయకుడుని..ఆయనకు సంఘ విద్రోహ శక్తులు నుంచి ముప్పు ఉందంటూ డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.

గతంలో జరిగిన దాడి ప్రస్తావన
రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందంటూ లేఖలో వివరించారు. దీనికి కొనసాగింపుగా.. 19 అక్టోబర్ 2021న, అధికార వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని లేఖలో ప్రస్తావించారు.దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తలను చంపడానికి ప్రయత్నించారంటూ ఆరోపించారు. దాడి జరగక మునుపు కార్యాలయానికి 24 గంటలూ సాయుధ భద్రత ఉండేదని గుర్తు చేసారు.
Recommended Video

సాయుధ భద్రత కల్పించాలంటూ
ఆశ్చర్యకరంగా, పార్టీ కార్యాలయానికి ఎటువంటి సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా భద్రతను తొలగించారని లేఖలో పేర్కొన్నారు. టిడిపి కార్యాలయం పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం పక్కనే ఉన్నప్పటికీ అధికార పార్టీ అనుచరులుగా చెప్పుకుంటున్న గూండాలు దాడికి తెగబడ్డారని వివరించారు. దీంతో.. పార్టీ కార్యాలయంపై ఎలాంటి దాడులు జరగకుండా, కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు రక్షణ కల్పించేందుకు 24 గంటలపాటు సాయుధ భద్రత కల్పించాలని పార్టీ నేత వర్ల రామయ్య డీజీపీకి రాసిన లేఖ లో అభ్యర్థించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications