జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్
అమరావతి: మాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావుతో పాటు ఆయన తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణ ప్రసాద్ గురువారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
గత ఎన్నికల సమయంలో వసంత నాగేశ్వర్ రావు ఆయన తనయుడు టిడిపిలో చేరారు. అయితే ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేదని వసంత కృష్ణప్రసాద్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

ఈ తరుణంలో ఇటీవలనే వసంత కృష్ణప్రసాద్ ను కొందరు టిడిపి నేతలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్ళారు. గుంటూరు జిల్లాలో పనిచేయాలని వసంత కృష్ణప్రసాద్‌కు సూచించారు.కానీ ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ తరుణంలో గురువారం నాడు తన అనుచరులతో కలిసి కృష్ణా జిల్లా కైకలూరులో సాగుతున్న జగన్ పాదయాత్రలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన ఆయన తండ్రి వసంత నాగేశ్వర్ రావు కూడ వైసీపీలో చేరారు.
కృష్ణా జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వసంత నాగేశ్వర్ రావు,కృష్ణ ప్రసాద్‌లు ప్రకటించారు. మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి కూడ వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే రామ్ కుమార్ రెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని రెండు మూడు మాసాల్లో ప్రకటించనున్నట్టు చెప్పారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications