వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఇచ్చిన రూ.7660 కోట్లు మాయం-వివరాలు కోరుతూ పెద్దిరెడ్డికి వైవీబీ లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీలో గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీలో సర్పంచ్ ల ఖాతాల్లో రూ.7660 కోట్లు వేశామని కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఆ నిధులు ఏమయ్యాయని టీడీపీ ప్రశ్నిస్తోంది.

కేంద్రం గ్రామ పంచాయతీలకు 2018-21 మధ్యలో విడుదల చేసిన ఆ 7660 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవాళ మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ లేఖ రాశారు. రాజ్యసభలో వైయస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 2018 నుంచి 2021 వరకు రూ,,7660 కోట్లు పంపించామని కేంద్ర మంత్రి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ నిధులు పంచాయతీల ఖాతాలు పడాల్సి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. దీనిపై వైవీబీ.. మంత్రి పెద్దిరెడ్డికి ప్రశ్నలు సంధించారు

tdp leader yvb rajendraprasad ask ap minister peddireddy about rs.7660 cr funds released by centre

కేంద్రం విడుదల చేసిన నిధులు గ్రామ పంచాయతీల ఖాతాలలో కనిపించడం లేదని సర్పంచ్ లు ఖంగుతిన్నారు. రాష్ట్రంలోని 12918 మంది సర్పంచులు ఈ మేరకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పంచాయతీ రాజ్ ఛాంబర్ తరఫున వైవీబీ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ 7660 కోట్లు దారి మళ్లించి, తన సొంత అవసరాలకు వాడేసుకుందని సర్పంచుల సంఘం అనుమానం వ్యక్తం చేసింది. ఆ 7660 కోట్లు లెక్క నిగ్గు తేల్చాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని లేఖలో పెద్దిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ స్పష్టం చేశారు.

English summary
tdp leader yvb rajendra prasad on today made allegations on ysrcp govt for not releasing funds to sarpanches given by central govt earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X