వైసీపీ గూండాలను వదిలేసి దేవినేనిపై కేసులా? భగ్గుమన్న టీడీపీ ; మైలవరంలో టీడీపీ ఆందోళన, అరెస్టులు

టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసి నరకయాతన చూపిస్తున్న తీరుపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శిస్తున్నారు. ప్రశ్నించే నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. దేవినేని ఉమ అరెస్టు తో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.

పోలీసులు దగ్గరుండి మరీ దేవినేని ఉమాపై భౌతిక దాడి : ధూళిపాళ్ళ నరేంద్ర ఫైర్

ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ లు దేవినేని ఉమ అరెస్ట్ పై వైసీపీ సర్కార్ రాక్షస పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా దేవినేని ఉమ అరెస్ట్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ధూళిపాళ్ల నరేంద్ర ఆయనపై దాడి చేసి మరీ తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు దగ్గరుండి మరీ దేవినేని ఉమాపై భౌతిక దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగే మార్గం వైపు ఆయనను మళ్లించారని విమర్శించారు. ఏపీలో రక్షకులే భక్షకులైన పరిస్థితి తాజా పరిణామాలతో కనిపిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ గూండాలను వదిలేసి దేవినేనిపై కేసులా ? ధూళిపాళ్ళ నరేంద్ర

వైసీపీ గూండాలను వదిలేసి దేవినేనిపై కేసులా ? ధూళిపాళ్ళ నరేంద్ర

దేవినేని ఫిర్యాదు చేయకుండా ముందే ఎదురు కేసు పెడతారా అంటూ ధూళిపాళ్ళ పోలీసులను నిలదీశారు. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నేపథ్యంలో నిజ నిర్ధారణ కోసం వెళ్ళిన దేవినేని ఉమా పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు తిప్పుతూ నరకాన్ని చూపించడం దారుణమని ధూళిపాళ్ళ నరేంద్ర మండిపడ్డారు. వైయస్సార్ సిపి గూండాలని వదిలేసి దేవినేని పై కేసులు పెడతారా అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

మైనింగ్ కు ఎస్సీ ,ఎస్టీలకు సంబంధం ఏంటి ? అశోక్ బాబు

టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అసలు మైనింగ్ కు ఎస్సీ, ఎస్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దేవినేని పై దాడి చేసిన వారిని వదిలేసి టిడిపి కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడతారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అశోక్ బాబు. దాడికి పోలీసులు దగ్గరుండి మరీ సహకరించారని వైసిపి గుండాలు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మనుషులు దేవినేనిపై దాడికి తెగబడ్డారు అని ఆరోపించారు. ఉమా పై ఎమ్మెల్యే దగ్గరుండి మరీ దాడి చేయించారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైలవరంలో టీడీపీ నేతల ఆందోళన ..అరెస్ట్ లు

ఇదిలా ఉంటే మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు నేపథ్యంలో మైలవరంలో టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. టిడిపి నేత దేవినేని ఉమను విడుదల చేయాలని కోరుతూ నిరసన చేపట్టిన టిడిపి శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. దీంతో టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. టిడిపి నాయకుల నిరసనలతో, పోలీసులు అరెస్టులతో మైలవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అరెస్ట్ చేసిన టిడిపి నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+