జగన్ కు అధికార దాహం, పదవి ముఖ్యమా, ప్రజలు సమస్యలు ముఖ్యమా, ఇంకానా ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసెంబీకి వెళ్లే ధైర్యం కాని, దమ్ముకాని లేదని, ఇంతకాలం వైసీపీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నారనే ధైర్యంతోనే అసెంబ్లీకి వెళ్లారని, ఇప్పుడు జగన్ కు ఆయన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలోకి వెళ్లాలంటే హడలిపోతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆరోపించారు.
పరదాలు కట్టుకుని దొంగచాటుగా తిరిగే జగన్ కు జనం సమస్యల గురించి ఏం తెలుసు అని టీడీపీ నాయకుడు సురేంద్ర కుమార్ ఆరోపించారు. చిత్తూరులో విలేకరులతో మాట్లాడిన సురేంద్ర కుమార్ మాజీ సీఎం జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం సీఎం హోదాలో అసెంబ్లీలో చక్రం తిప్పిన వైఎస్ జగన్ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని, అందుకే ప్రజలు కూడా జగన్ ను, వైసీపీ నాయకులను అలాగే గాలికి వదిలేశారని సురేంద్ర కుమార్ వ్యంగంగా అన్నారు.

2019లో జగన్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ రోజు ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉందని అసెంబ్లీ సాక్షిగా జగన్ మాట్లాడారని, ఆ విషయం జగన్ తో పాటు వైసీపీ నాయకులు మరిచిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోరని, అసెంబ్లీ రికార్డుల్లో కూడా ఆయన మాట్లాడిన మాటల రికార్డులు ఉంటాయని టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ చెప్పారు.
ప్రజలు చిత్తుగా ఓడించడంతో మతి భ్రమించిన జగన్ గతంలో ఏంమాట్లాడారో మరిచిపోయాడని, అందుకే ఇప్పుడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరం లేదని, ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చని, ఆ మాత్రం కూడా ఆలోచించకుండా స్పీకర్ కు లేఖ రాసి తనకు ఆ పదవి కావాలి అంటూ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ జగన్ పై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications