గుంతకల్లులో చెప్పులతో కొట్టుకొన్న తెలుగు తమ్ముళ్ళు, ఎందుకంటే?
అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు చెప్పులతో కొట్టుకొన్నారు. టీడీపి సమన్వయ కమిటీ సమావేశంలోనే చెప్పులతో కొట్టుకొన్నారు. సమావేశానికి ఎందుకు వచ్చావంటూ ఇరువర్గాల మధ్య ప్రారంభమైన గొడవ బాహాబాహీకి కారణమైంది.
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు చెప్పులతో కొట్టుకొన్నారు. టీడీపి సమన్వయ కమిటీ సమావేశంలోనే చెప్పులతో కొట్టుకొన్నారు. సమావేశానికి ఎందుకు వచ్చావంటూ ఇరువర్గాల మధ్య ప్రారంభమైన గొడవ బాహాబాహీకి కారణమైంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు లో గురువారం నాడు రెండు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీలోని రెండు వర్గాలు బాహాబాహీకి పాల్పడ్డారు.

ఇటీవలనే వైసీపి నుండి టిడిపిలోకి మస్తానయ్య చేరాడు. అయితే టీడిపి సమన్వయ కమిటీ సమావేశానికి నీవు ఎందుకు వచ్చావంటూ రామాంజనేయులు ప్రశ్నించాడు.
దీంతో రామాంజనేయులు, మస్తానయ్య వర్గాల మధ్య వాగ్వావాదం చిలికి గాలివానగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు.ఒకానొకదశలో రెండు వర్గాలు చెప్పులతో దాడికి దిగారు. అయితే సమావేశంలో పాల్గొన్న నాయకులు రెండు వర్గాలను సముదాయించారు.












Click it and Unblock the Notifications