వంగవీటి రాధాను పొమ్మనకుండా పొగ పెడుతున్నారా..!?
ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. విజయవాడ కేంద్రంగా టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ సీటు గురించి టీడీపీ, జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్ లో టీడీపీ నేతలు వంగవీటి రాధా, బోండా ఉమ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ కొనసాగుతోంది.
Recommended Video

కీలక మలుపు : విజయవాడ టీడీపీలో ఎన్నికల వేళ రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకొనే ఎన్టీర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పశ్చిమం సీటు నుంచి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా వంటి నేతలు రేసులో ఉన్నారు. ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్ గురించి చర్చ మొదలైంది. ఈ సీటును గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ప్రశ్నలు - వైరల్ : ఇప్పుడు ఈ సీటు నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో, కొద్ది రోజులుగా రాధా, ఉమా వర్గీయుల మధ్య పోస్టుల యుద్ధం జరుగుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ పోస్టింగ్స్ బోండా ఉమ మద్దతుదారులే చేస్తున్నారని రాధా వర్గం ఆనుమానిస్తోంది. దీంతో, ఇప్పుడు బోండా ఉమాను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఉమాను టార్గెట్ చేసే విధంగా ఈ పోస్టింగ్స్ రాధా మద్దతు దారులే సర్క్యులేట్ చేస్తున్నారనేది ఉమా మద్దతు దారుల ఆరోపణ. తాజాగా వంగవీటి రాధాను నమ్మాలంటే ఏం చేయాలంటూ కొన్ని పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి.

సీటు దక్కేదెవరికి : రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే.. ఉమాపై పదిహేడు పాయింట్లతో పోస్టులు మొదలయ్యాయి. నమ్మకానికి ఇవేనా ప్రామాణికాలు అంటూ ప్రశ్నలు సంధించారు. డబ్బు కోసం గెలిచిన పదవి అమ్మకోవాలా..పార్టీ పదవి కోసం పార్టీని బెదిరించాలా..డబ్బు కోసం పార్టీ పదవి అమ్ముకోవాలా..డబ్బు కోసం కార్పోరేటర్ సీట్లు అమ్ముకోవాలా..పోటీ చేసిన కార్పోరేటర్ డబ్బులు ఇవ్వకపోతే ఎదుటి పార్టీ వారితో కుమ్మక్కు అవ్వాలా అంటూ చేసిన పోస్టింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ సోషల్ మీడియా వార్ పైన వంగవీటి, బోండా ఉమా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications