కెసిఆర్‌కు పిచ్చి అన్నందుకు టిడిపి నేతలపై కేసు

హైదరాబాద్: తెలంగాణ చిహ్నాలను అవమానించారని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర రెడ్డిలపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కె. గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది బుధవారం ఈ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును పరిశీలించిన - కేసు నమోదు చేసి, ఆరోపణలపై దర్యాప్తు జరిపి, వచ్చే ఏడాది జనవరి 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ డిసెంబర్ 6వ తేదీన ఆ ఇద్దరు నాయకులు ప్రకటన, వ్యాఖ్యలు చేశారని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.

TDP leaders booked for calling CM K Chandrasekhar Rao ‘mad’

మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పిచ్చివాడని, ఆయనను ఎవరూ నమ్మరని అన్నట్లు గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నాలుగా ప్రకటించినవాటిని అవమానిస్తూ రావుల చంద్రశేఖర రెడ్డి ప్రకటన చేశారని ఆయన అన్నారు.

ఈ ఇద్దరు నాయకులను భారత శిక్షాస్మృతిలోని 295ఎ, 504, 505 సెక్షన్ల కింద శిక్షించాలని గోవర్ధన్ రెడ్డి కోర్టును కోరారు. వారి ప్రకటనలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. కాగా, ఇంతకు ముందు బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+