జగన్‌పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయండి: డిజిపికి ఫిర్యాదు, నంద్యాలకు వచ్చి మాట్లాడకుండా!

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్‌పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని టిడిపి నేతలు సోమవారం డిజిపి సాంబశివ రావును కలిసి విజ్ఞప్తి చేశారు.

జగన్‌కు ఈసీ షాక్: 'కాల్చి చంపడంపై' నోటీసులు, 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే

సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని ఫిర్యాదు

సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని ఫిర్యాదు

టిడిపి నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు డిజిపిని కలిశారు. జగన్‌పై సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని వారు కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

ఆ బ్యాచ్‌కు, జగన్ బ్యాచ్‌కు తేడా లేదు

ఆ బ్యాచ్‌కు, జగన్ బ్యాచ్‌కు తేడా లేదు

జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. బ్లేడ్ బ్యాచ్, ఖల్ నాయక్ బ్యాచులకు, జగన్ బ్యాచుకు తేడా లేదని విమర్శించారు. జగన్‌పై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. జగన్ ఓ అరాచక శక్తి అన్నారు.

YSRCP To Win AP in 2019 : Survey Reports
డ్రామా పార్టీ, అందుకే ఫిర్యాదు

డ్రామా పార్టీ, అందుకే ఫిర్యాదు

వైసిపి రాజకీయ పార్టీ కాదని, అదో డ్రామా పార్టీ అని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్‌లా చంద్రబాబుది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కాదని చెప్పారు. తాము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే డిజిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామని టిడిపి నేత బచ్చుల అర్జునుడు అన్నారు.

నంద్యాలలో పెళ్లికి హాజరై వెళ్లిన జగన్

నంద్యాలలో పెళ్లికి హాజరై వెళ్లిన జగన్

జగన్ ఆదివారం నంద్యాలలో పార్టీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడి తనయుడి వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఇటీవల చంద్రబాబుపై ఆయన చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై ప్రశ్నలు అడిగేందుకు మీడియా ప్రతినిధులు వేచి చూశారు. కానీ ఆయన మాట్లాడకుండా వెళ్లిపోయారు. పెళ్లికి వచ్చినందున మాట్లాడకుండా వెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leaders complaint against YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Nandyal comments on AP CM Nara Chandrababu Naidu.
Please Wait while comments are loading...