ఎగ్జిట్ పోల్స్ పై టీడీపీ కూటమిలో డౌట్ - అసలు కారణం...!!
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తరువాత కొత్త రాజకీయం కనిపిస్తోంది. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో, అసలు ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ పై అటు వైసీపీ..ఇటు టీడీపీ కూటమిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే..టీడీపీ కూటమిలో ఇప్పుడు కొత్త సందేహం మొదలైంది. పార్టీ నేతల మధ్యే అదే చర్చగా మారుతోంది.
సర్వేల లెక్కలతో
రాష్ట్రంలో టీడీపీ కూటమికే అధికారం దక్కనుందని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేసాయి. అయితే, అందులో జాతీయ..కొత్త సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్న లోకల్ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు ఇచ్చిన ఫలితాలతో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జాతీయ సర్వే సంస్థలు దాదాపు పూర్తిగా కూటమికే విజయావకాశాలున్నాయని తేల్చేశాయి. కానీ, వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థల నివేదికల పైనా టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వీటిల్లో ఏది నిజం అయ్యే అవకాశం ఉందని ఆరా తీస్తున్నారు.

ఎవరి అంచనాలు వారివే
వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించినప్పటికీ అందులో ఆరా అనే సంస్థ అంచనాలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ముఖ్య నేతలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలపై ఆరా ఇచ్చిన విశ్లేషణ తో పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఇండియా టుడే, ఏబీసీ సీవోటర్, పయనీర్, ఇండియా టీవీ, సీఎన్‌ఎస్, న్యూస్ 18 తదితర జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమికి ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ స్థానాల్లో పూర్తి ఆధిక్యత వస్తుందని కూడా బహిర్గతం చేశాయి.
ఏది నిజం అయ్యేను
అయితే వీటిలో ఆరా సంస్థ రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అయితే ఈ పర్యాయం ఆ సంస్థ టీడీపీ కూటమి కన్నా 15 నుంచి 20 స్థానాల ఆధిక్యతతో వైసీపీ తిరిగి అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో వైసీపీలోని కొందరు ప్రముఖులు, కొందరు మంత్రులు ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని ప్రకటించింది. అదే సమయంలో తాము ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఆరా సంస్థ చెప్పుకొచ్చింది. దీంతో..అసలు ఫలితం ఎలా ఉంటుందనే చర్చ కూటమి నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications