జనసేనలో బీజేపీ నేతలు, పవన్ చెప్పింది వినరు: చిరును లాగి టీడీపీ షాకింగ్, సిగ్గులేకుండా.. అవినాష్
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లేఖ పైన తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేతల వర్ల రామయ్య తదితరులు మండిపడ్డారు. ఆర్థిక నేరస్తుడు విజయ సాయి రెడ్డికు పీఎంవోలో ఏం పని అని నిలదీస్తున్నారు.
చదవండి: బాబు యూటర్న్, ఇవి ఎక్కడ?: అమిత్ షా జగన్ ఆశ్చర్యం, 'పవన్! నువ్వు అక్కడ లేవుగా'
ఏపీకి నష్టం చేకూర్చాలనే బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తోందని కొల్లు మండిపడ్డారు. చంద్రబాబుకు అమిత్ షా రాసిన తొమ్మిది పేజీల లేఖలో ఒక్క వాస్తవం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చి, రూ.250 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. యూసీలు 8 శాతమే ఇచ్చామని అసత్యాలు చెబుతున్నారన్నారు.
చదవండి: బాబూ! వెరీ గుడ్: కేంద్రం మీద పోరాటంపై మమత, అవిశ్వాసంపై దిగొచ్చిన మోడీ!

ఇక్కడే కేంద్రం చిత్తశుద్ధి తేలిపోతుంది
వేసిన నిధులనే మళ్లీ వెనక్కి తీసుకున్నారని, ఇక్కడే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చునని కొల్లు అన్నారు. హోదా డిమాండును అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఏపీలో రూ.16వేల లోటు బడ్జెట్ అని కాగ్ నివేదిక చేబితే దానిని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే నాలుగేళ్లు ఎదురుచూసే వారు కాదన్నారు. బీజేపీయే లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. వైసీపీ సభ్యులు సభలో అవిశ్వాసం, ప్రధాని కార్యాలయంలో విశ్వాసం ప్రకటిస్తారన్నారు.

అమిత్ షా సిగ్గులేకుండా.. హోదా సాధిస్తాం
అమిత్ షా రాసిన లేఖలో అన్నీ అబద్దాలే ఉన్నాయని దేవినేని అవినాశ్ ధ్వజమెత్తారు. అమిత్ షా సిగ్గులేకుండా అవాస్తవాలు చెప్పారన్నారు. చంద్రబాబు సామర్థ్యం, నిజాయితీ ప్రజలకు తెలుసునని చెప్పారు. తమ పార్టీ అధినేతను ఎదుర్కోలేక కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హోదా సాధిస్తామన్నారు.

జనసేన అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు, పీఆర్పీ..
జనసేనపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదన్నారు. పవన్ నియమించిన అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు బీజేపీ చెప్పింది వింటారని, పవన్ కళ్యాణ్ చెప్పింది ఎందుకు వింటారని ప్రశ్నించారు. పవన్ కూడా వారు చెప్పిందే వింటారన్నారు.

చిరంజీవి కొన్ని సీట్లైనా గెలిచారు.. పవన్ ముందే సర్దేస్తారు
నాడు ప్రజారాజ్యం పార్టీ స్తాపించిన చిరంజీవి కొన్ని సీట్లయినా గెలిచారని, పవన్ కళ్యాణ్ అంతకన్నా ముందే దుకాణం సర్దేస్తారన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని బీజేపీ డ్రామాలు ఆడుతోందని వర్ల రామయ్య మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతో లాలూచీ పడ్డారన్నారు. కేంద్రంతో లాలూచీపడిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రజల కోపానికి వైసీపీ గంగలో కలవడం ఖాయమన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన వైసీపీ నేతలు ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు.

బీజేపీతో నష్టపోయామని ట్విస్ట్
బీజేపీతో పొత్తు వల్ల తాము చాలా నష్టపోయామని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తాము చాలా సీట్లు కోల్పోయామని ట్విస్ట్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. పోలవరం సహా అభివృద్ధి పనులు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఏపీకి హోదా సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications