ఎవరు పిలిచారయ్యా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే చింతలపై టీడీపీ ఫైర్
పీలేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చిత్తూరు: పీలేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను వైసీపీలోనే కొనసాగుతానని, టీడీపీలోకి చేరే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే, చింతల వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అసలు ఆయనను టీడీపీలోకి రావాలని ఎవరు పిలిచారంటూ ప్రశ్నించారు. చింతలలాంటి అభివృద్ధి నిరోధకులు టీడీపీకి అవసరం లేదని తేల్చి చెప్పారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో జగన్, రోజాలకు మతి భ్రమించిందని, వారిలాగే చింతలకు కూడా మతిభ్రమించిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి చింతల నెల రోజులపాటు నంద్యాలలోనే మకాం వేశారని.. అయినా, సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
చింతల చవకబారు కామెంట్లను మానుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో చింతల ఏ పార్టీ తరపున పోటీ చేసినా, ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాగా, చింతల టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications